శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని ... వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో ఇద్దరు తీవ్రవాదులు నవ్గామ్ ప్రాంతంలో భారత్లోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరపగా... ఆ ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారని చెప్పారు.
కుప్వారాలోని అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నోవ్గామ్ ప్రాంతంలో తీవ్రవాదులు చోరబడకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వివరించారు.