శ్రీనగర్ : కాశ్మీర్ కుప్వారా జిల్లా మర్సారి గ్రామంలోని చౌకీబాల్ సరిహద్దు ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
సదరు గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగి ఉన్నారని శుక్రవారం సాయంత్రం భద్రత దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ అపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రవాదులు దాగి ఉన్న ఇంటిని చుట్టిముట్టారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు.
కాశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ సైనికులు మృతి
Published Sat, Feb 13 2016 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
Advertisement
Advertisement