Army personnel
-
నాగాలాండ్ పౌర హత్యలు: ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ కేసు రద్దు
ఢిల్లీ: నాగాలాండ్ మోన్ జిల్లాలో 13 మంది పౌరుల హత్య కేసులో ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసుపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లోని చేర్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇక.. ఈ కేసును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావచ్చు. అదేవిధంగా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీకి సూచించాం’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.డిసెంబర్ 4, 2021న నాగాలాండ్‌లోని ఓటింగ్ గ్రామంలో మైనర్లను తీసుకెళ్తున్న ట్రక్కుపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపింద. అయితే ఆ ట్రక్కులో ఉన్నవాళ్లను ఆర్మీ సిబ్బంది మిలిటెంట్లుగా భావిసించి కాల్పులు జరిపింది.ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు.చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
సిక్కిం కుంభవృష్టి.. 102 మంది మిస్సింగ్
గాంగ్టక్: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం వణికిపోతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది పౌరులు మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి. ⚡️⚠️ 𝐄𝐍𝐃 𝐓𝐈𝐌𝐄 𝐒𝐂𝐄𝐍𝐀𝐑𝐈𝐎⚠️⚡️ 𝐃𝐞𝐯𝐚𝐬𝐭𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐥𝐨𝐨𝐝 𝐢𝐧 𝐒𝐢𝐤𝐤𝐢𝐦,𝐈𝐧𝐝𝐢𝐚 As many as 10 civilians have died and 82 people, including 22 Army personnel, are missing after a cloudburst over the Lhonak Lake in north Sikkim caused it to overflow,… pic.twitter.com/rBOrPhUjkK — {Matt} $XRPatriot (@matttttt187) October 5, 2023 కూలిన 14 వంతెనలు సింగ్తామ్ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోగా బుధవారం సాయంత్రం నాటికి ఓ సైనికుడిని సహాయక బృందాలు రక్షించాయి. రాష్ట్రంలో 14 వంతెనలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. బుధవారం చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారిందని తెలియజేశాయి. सिक्किम में सेना के 23 जवान लापता। उत्तरी सिक्किम में अचानक बादल फटने से तीस्ता नदी में बाढ़ आ गई। अचानक आई इस बाढ़ के कारण सेना के 23 जवान लापता हो गए हैं। खोज एवं बचाव अभियान जारी है। ईश्वर से सभी की कुशलता के लिए प्रार्थना 🙏🏽#sikkimflood#IndianArmy#TeestaRiver#Sikkim pic.twitter.com/Gy7Nv1ooZP — JAGDISH PALIWAL (@JAGDISH_BAP) October 5, 2023 లోతట్టు ప్రాంతాలు జలమయం రాజధాని గాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తామ్ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది. People being rescued and taken to a safe shelter. They didn’t have any say in large infrastructure project, but pay the price of the disaster. #Sikkim pic.twitter.com/KdKu3yIOdT — Aparna (@chhuti_is) October 4, 2023 జనం అప్రమత్తంగా ఉండాలని సూచన వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. మాంగాన్, గాంగ్టక్, పాక్యోంగ్, నామ్చీ జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 8 దాకా సెలవు ప్రకటించింది. ఉత్తర బెంగాల్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుంగ్తాంగ్లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ వద్ద పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకొని ఉన్నారు. చుంగ్‌తాగ్, ఉత్తర సిక్కింలో చాలా వరకు మొబైల్ నెట్‌వర్క్‌లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది.. చుంగ్తాంగ్లోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం అయ్యింది. #earthquake #GayatriJoshi #SikkimCloudburst #SanjaySinghArrested #ElvishYadav #AishwaryaRai #ChampionsLeague 14 Dead, 102 Missing In Sikkim Flash Flood, Missing Armyman Rescued Over 3,000 tourists are feared stranded, said a government official. The Army said it has rescued… pic.twitter.com/AleFmJgiL3 — shakir Berawala (@shakirBerawala) October 5, 2023 -
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ ట్రక్కు
-
ఘోర ప్రమాదం.. భారత జవాన్ల దుర్మరణం
గ్యాంగ్‌టక్: ఘోర రోడ్డు ప్రమాదంలో భారత జవాన్లు మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో.. చాటేన్‌నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు మలుపు తీసుకునే సమయంలో.. వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంత మంది గాయపడ్డారన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జవాన్లు అందించిన సేవలు మరువలేనివని, ఘటన తీవ్రంగా బాధించిందని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Deeply pained by the loss of lives of the Indian Army personnel due to a road accident in North Sikkim. The nation is deeply grateful for their service and commitment. My condolences to the bereaved families. Praying for the speedy recovery of those who are injured. — Rajnath Singh (@rajnathsingh) December 23, 2022 -
ట్విస్ట్ : ఆ లేఖ ఏంటో కూడా తెలియదు!
న్యూఢిల్లీ : భారత సాయుధ బలగాల త్యాగాలను రాజకీయం చేస్తున్నారంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన 150 మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ‘ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ వెటరన్స్ టు అవర్ సుప్రీం కమాండర్’ పేరిట పలువురు మాజీ అధికారులు త్రివిధ దళాధిపతికి రాసిన లేఖ పలు చానళ్లలో దర్శనమిచ్చింది. అయితే తమకు ఎటువంటి లేఖ అందలేదని ఇప్పటికే రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించగా.. కొంతమంది మాజీ అధికారులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. రాష్ట్రపతికి రాసినట్లుగా రాసిన ఈ లేఖపై తొలి సంతకం చేసినట్లుగా భావిస్తున్న ఆర్మీ మాజీ చీఫ్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగస్, ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎన్సీ సూరి వివరణ ఇచ్చారు. ఈ విషయం గురించి సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగస్ మాట్లాడుతూ...‘ అసలు ఆ లేఖ ఏంటో కూడా తెలియదు. నా జీవిత కాలమంతా రాజకీయాలకు దూరంగా ఉన్నా. 42 ఏళ్ల పాటు సైనికుడిగా ఉన్న నేను భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నించాను. కానీ ఇలాంటి నకిలీ వార్తలు సృష్టించడానికి వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకువస్తారో అర్థం కావడం లేదు. నేను సంతకం చేయలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎన్సీ సూరి కూడా ఈ లేఖను ఖండిస్తూ.. ‘ ఇది అడ్మిరల్ రామ్‌దాస్ లెటర్ కానేకాదు. మేజర్ చౌదరి లేఖ రాసినట్లుగా వాట్సాప్, ఇమెయిల్స్ వస్తున్నాయి. నా అనుమతి లేకుండా నా పేరు ఎలా ఉపయోగిస్తారు. దీంతో నేను అంగీకరించడం లేదు’ అని వివరణ ఇచ్చారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రధాని మోదీ ఈనెల 9న మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల బలిదానాలను రాజకీయ పార్టీలు, నాయకులు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ..మాజీ అధికారులు లేఖ రాసినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. #WATCH Goa: General SF Rodrigues who is mentioned as the first signatory in the purported letter written by armed forces veterans to President, denies signing it. pic.twitter.com/h1PNBCV909 — ANI (@ANI) April 12, 2019 -
‘జోక్యం చేసుకోండి.. లేఖ అందలేదు’
న్యూఢిల్లీ : భారత సాయుధ బలగాల త్యాగాలను రాజకీయం చేస్తున్నారంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన 150 మందికి పైగా రిటైర్డ్ ఆఫీసర్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ వెటరన్స్ టు అవర్ సుప్రీం కమాండర్’ పేరిట త్రివిధ దళాధిపతికి రాసిన లేఖలో సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం.. భారత సైన్యం యూనిఫాం, గుర్తులు లేదా సైనికుల త్యాగాల గురించి నాయకులు ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇటువంటి వ్యాఖ్యల గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని, దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ వర్గాలు మాత్రం తమకు ఎటువంటి లేఖ అందలేదని పేర్కొనడం గమనార్హం. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రధాని మోదీ ఈనెల 9న మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సైనికుల బలిదానాలను రాజకీయ పార్టీలు, నాయకులు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ.. ఆర్మీ మాజీ చీఫ్‌లు సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగస్, శంకర్ రాయ్‌చౌదరి, దీపక్ కపూర్... మాజీ నేవీ ప్రధానాధికారులు లక్ష్మీనారాయణ్ రామ్‌దాస్, విష్ణు భగవత్, అరుణ్ ప్రకాశ్, సురేష్ మెహతా, ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎన్సీ సూరీ తదితరులతో సహా 150 మంది రిటైర్డు అధికారులు రాష్ట్రపతికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక.. ‘మోదీ కోసమో, రాహుల్ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు మమ్మల్ని కచ్చితంగా మరచిపోతారు. అది మాకు తెలుసు’ అంటూ పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్ రాజకీయ నాయకుల తీరును ఎండగట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలువురు నేతలు తమ పంథా మార్చుకోవడం లేదు. -
ఆర్మీ సిబ్బందిపై అత్యాచారం కేసు
పుణె: మూగ, చెవిటి మహిళను 2015లో అత్యాచారం చేశారన్న ఆరోపణలపై నలుగురు ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పుణె శివారుల్లోని ఖడ్కీలో ఉన్న సైనిక ఆసుపత్రిలో సదరు మహిళ ఉద్యోగినిగా ఉండగా నలుగురు సిబ్బంది రేప్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో తనపై జరిగిన దారుణాలను బాధితురాలు సంజ్ఞల భాష నిపుణుడికి వివరించడంతో ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులతోపాటు ఆర్మీ ఈ కేసులో విచారణ జరుపుతోంది. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ సైనికులు మృతి
శ్రీనగర్ : కాశ్మీర్ కుప్వారా జిల్లా మర్సారి గ్రామంలోని చౌకీబాల్ సరిహద్దు ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సదరు గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగి ఉన్నారని శుక్రవారం సాయంత్రం భద్రత దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ అపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రవాదులు దాగి ఉన్న ఇంటిని చుట్టిముట్టారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు. -
తీవ్రవాదుల పోరులో 57 మంది సైనికులు మృతి
న్యూఢిల్లీ : తీవ్రవాదులతో జరిపిన పోరులో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 57 మంది భారత సైనికులు మృతి చెందారు. ఈ మేరకు రక్షణ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది జున్ 1వ తేదీ నుంచి నవంబర్ వరకు 38 మంది సైనికులు మరణించారని చెప్పారు. అలాగే సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 151 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రావు ఇంద్రజిత్ మంగళవారం పైవిధంగా సమాధానం చెప్పారు. -
అక్రమంగా తరలిస్తున్న రూ.43 లక్షలు స్వాధీనం
ఒంగోలు టౌన్ : రైలులో అక్రమంగా తరలిస్తున్న 43లక్షల రూపాయల నగదును ఒంగోలు టూటౌన్ పోలీసులు మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరిజిల్లా ఏలూరుకు చెందిన సక్రు నరేష్ దిబ్రూఘడ్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో 43 లక్షల రూపాయలున్న బ్యాగుతో ప్రయాణిస్తున్నాడు. అయితే, అతను మిలిటరీ కోచ్‌లో ఎక్కడంతో అతని వద్ద భారీగా నగదు ఉండటాన్ని ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది ఆర్మీ సిబ్బంది గమనించారు. అతని వాలకంపై ఆర్మీ సిబ్బందికి అనుమానం వచ్చి రైలు ఒంగోలు చేరే ముందుగా జిల్లా ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ సిబ్బందితో కలిసి దాడిచేసి నరేష్‌ను పట్టుకున్నారు. అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అరెస్టు చేయడంతో పాటు నగదును స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. పొంతనలేని సమాధానాలు చెప్పిన నిందితుడు... పోలీసు విచారణలో నిందితుడు నరేష్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తనది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరని, అక్కడ కోటేశ్వరరావుకు చెందిన కుందన్ జ్యువెలరీస్‌లో తాను గుమస్తాగా పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. ఏలూరులోని వెంకన్నచెరువు వద్ద ఉన్న దక్షిణపు వీధిలో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు. తాను విజయవాడలో దిగాల్సి ఉందని పోలీసులతో చెబుతున్నప్పటికీ అతని వద్ద ఏలూరు నుంచి నెల్లూరు వరకు ప్రయాణించేందుకు తీసుకున్న రైలు టికెట్ ఉంది. నగదు గురించి అడిగితే సమాధానం దాటవేస్తుండటంతో అతను వాస్తవాలు దాచిపెడుతున్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాస్తవాలు రాబట్టేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అతని వెనుక ఎవరో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ వెంట కొత్తపట్నం ఎస్సై బత్తుల నరసింహారావు, సిబ్బంది ఎం.రామకృష్ణ ఉన్నారు.