Sikkim Road Accident: 16 Army jawans killed, 4 injured - Sakshi

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారత జవాన్ల దుర్మరణం

Dec 23 2022 3:32 PM | Updated on Dec 23 2022 4:13 PM

Sikkim Road Accident Army personnel have lost their lives - Sakshi

మలుపు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత జవాన్లు.. 

గ్యాంగ్‌టక్‌: ఘోర రోడ్డు ప్రమాదంలో భారత జవాన్లు మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. 

భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో.. చాటేన్‌నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు మలుపు తీసుకునే సమయంలో.. వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంత మంది గాయపడ్డారన్నది తెలియాల్సి ఉంది.  ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జవాన్లు అందించిన సేవలు మరువలేనివని, ఘటన తీవ్రంగా బాధించిందని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement