నాగాలాండ్ పౌర హత్యలు: ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ కేసు రద్దు | Nagaland civilian incident: SC cancels criminal case against Army personnel | Sakshi
Sakshi News home page

నాగాలాండ్ పౌర హత్యలు: ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ కేసు రద్దు

Published Tue, Sep 17 2024 12:44 PM | Last Updated on Tue, Sep 17 2024 1:07 PM

Nagaland civilian incident: SC cancels criminal case against Army personnel

ఢిల్లీ: నాగాలాండ్‌ మోన్‌ జిల్లాలో 13 మంది పౌరుల హత్య కేసులో ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసుపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోని చేర్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇక.. ఈ కేసును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావచ్చు. అదేవిధంగా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీకి సూచించాం’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.

డిసెంబర్ 4, 2021న నాగాలాండ్‌లోని ఓటింగ్ గ్రామంలో మైనర్లను తీసుకెళ్తున్న ట్రక్కుపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపింద. అయితే ఆ ట్రక్కులో ఉన్నవాళ్లను ఆర్మీ సిబ్బంది మిలిటెంట్లుగా భావిసించి కాల్పులు జరిపింది.ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు.

చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement