న్యూఢిల్లీ : తీవ్రవాదులతో జరిపిన పోరులో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 57 మంది భారత సైనికులు మృతి చెందారు. ఈ మేరకు రక్షణ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది జున్ 1వ తేదీ నుంచి నవంబర్ వరకు 38 మంది సైనికులు మరణించారని చెప్పారు. అలాగే సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 151 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రావు ఇంద్రజిత్ మంగళవారం పైవిధంగా సమాధానం చెప్పారు.
తీవ్రవాదుల పోరులో 57 మంది సైనికులు మృతి
Published Wed, Dec 9 2015 8:07 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
Advertisement
Advertisement