Rao Inderjit Singh
-
దేశ జీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.. స్పందించిన కేంద్రం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2013-14లో రూ. 89,796 రూపాయలుగా ఉన్న భారతదేశ జీడీపీ తలసరి 2021-22 నాటికి రూ.1,72,913 రూపాయలకు పెరిగిందని ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. దేశ జాతీయ ఆదాయంలో టాప్ 1 శాతం కలిగిన ధనికులు 40 శాతం, టాప్ 10 శాతం కలిగిన ధనికులు 57 శాతం ఉంటే, దిగువనున్న 57 శాతం మంది ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారన్న వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్-2022 గణాంకాలు వాస్తవమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు -2022 నివేదిక సందేహాస్పదంగా ఉండడంతో దానిని పరిగణలోకి తీసుకోలేమని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా కోరిన వివరాలపై వ్యాఖ్యానించలేమని తెలిపారు. దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, వీక్షిత్ భారత్ ఉద్దేశాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌పై జీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఎంపీ విజయ సాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ఢిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా? డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వివరాలు తెలపాలని అన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. -
పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ గురువారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 8 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చింది రూ.11,182 కోట్లు అని ప్రకటించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం రూ.11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం రూ.55,657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే 8 ఏళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.11,182 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల వివరాలను కూడా మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ సవివరంగా తన జవాబులో తెలిపారు. ఏప్రిల్ 2018 నుంచి మార్చి 2019 వరకు రాష్ట్రంలో 88 కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల అమలు కోసం రూ.10,632 కోట్లు విడుదల ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు రాష్ట్రంలో 84 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ.11,112 కోట్లు విడుదల ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు 79 కేంద్ర పథకాల అమలు నిమిత్తం రూ.12,904 కోట్లు విడుదల ఏప్రిల్ 2021 నుంచి జూలై 2021 వరకు రాష్ట్రంలో అమలుచేస్తున్న 31 కేంద్ర పథకాల కోసం రూ.1,794 కోట్లు విడుదల -
నీతి అయోగ్ ర్యాంకింగ్.. టాప్ టెన్‌లో విజయనగరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంలో పురోగతి సాధిస్తున్న టాప్ టెన్ జిల్లాల్లో విజయనగరం జిల్లా ఉన్నట్లు గురువారం రాజ్య సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పురోగతిని అధ్యయనం చేసేందుకు నీతి అయోగ్ వివిధ రాష్ట్రాల నుంచి 117 జిల్లాలను ఎంపిక చేయగా అందులో ఆంధ్ర ప్రదేశ్ నుంచి కడప, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. మార్చి 2018 నుంచి మే 2018 మధ్య కాలంలో వ్యవసాయ రంగం పనితీరు సూచికల్లో సాధించిన పురోగతి ప్రాతిపదికపై ఆయా జిల్లాలకు నీతి అయోగ్ డెల్టా ర్యాంకింగ్ పేరిట ర్యాంక్‌లు జారీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అలా టాప్ టెన్ ర్యాంక్ సాధించిన జిల్లాల్లో ఒడిషాలోని కలహండి, మల్కాన్‌గిరి, తమిళనాడులోని రామనాధపురం, తెలంగాణలోని ఖమ్మం, పంజాబ్‌లోని మోగ, మణిపూర్‌లోని చాండెల్, ఏపీలోని విజయనగరం, అస్సాంలోని హైలకాండి, కర్నాటకలోని యాద్గిర్, సిక్కింలోని వెస్ట్ డిస్ట్రిక్ట్ టాప్ టెన్‌లో వరుసగా 1 నుంచి 10 స్థానాలు ఆక్రమించినట్లు మంత్రి తెలిపారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 117 అభిలషణీయ జిల్లాల్లో సత్వర మార్పును తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. వ్యవసాయం, నీటి వనరుల యాజమాన్యం ప్రధాన అంశాలు కాగా, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, ఆర్థిక స్వావలంబన, నైపుణ్య అభివృద్ధి వంటి ఇంతర అంశాల ప్రాతిపదికపై ఆయా జిల్లాల్లో నిర్ణీత కాలపరిమితిలో సాధించిన పురోగతిని పరిగణలోకి తీసుకుని డెల్టా ర్యాంకింగ్‌లు జారీ చేసినట్లు ఇందర్జిత్ సింగ్ వివరించారు. -
తీవ్రవాదుల పోరులో 57 మంది సైనికులు మృతి
న్యూఢిల్లీ : తీవ్రవాదులతో జరిపిన పోరులో గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 57 మంది భారత సైనికులు మృతి చెందారు. ఈ మేరకు రక్షణ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది జున్ 1వ తేదీ నుంచి నవంబర్ వరకు 38 మంది సైనికులు మరణించారని చెప్పారు. అలాగే సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 151 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రావు ఇంద్రజిత్ మంగళవారం పైవిధంగా సమాధానం చెప్పారు. -
తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు
-
వాద్రానూ వదలకూడదు!
న్యూఢిల్లీ: సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వెల్లువెత్తిన రియల్టీ, భూ కుంభకోణాల ఆరోపణలను ఇప్పటిదాకా ఖండిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూ దందాల ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడి ఉంటే వాద్రానైనా సరే వదలకూడదంటూ సొంత పార్టీ ఎంపీ రావ్ ఇంద్రజిత్ సింగ్ (గుర్గావ్) సోమవారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గుర్గావ్లో వ్యవసాయ భూములను వాణిజ్య, నివాస భూములుగా మార్చేస్తూ విచ్చలవిడిగా జారీ చేసిన అనుమతులపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం పని చేయాల్సిన తీరులో పని చేయలేదని కుండబద్దలు కొట్టిన ఎంపీ, ‘‘వాద్రాపై న్యాయ విచారణ జరపాలని కోరడం నా పని కాదు. నా సొంత లోక్‌సభ నియోజకవర్గంలో భూ దందా ద్వారా ఎవరైనా అక్రమంగా సంపాదిస్తున్నారా? అన్నది చూడటమే నా పని. అలా ఎవరైనా చేసి ఉంటే వారిని వదలకూడదు. అది వాద్రా అయినా సరే, తను చేసిన పనికి బాధ్యత వహించాల్సిందే’’ అని కూడా స్పష్టం చేశారు. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్తో వాద్రా భూ ఒప్పందాలను తప్పుబడుతూ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బయట పెట్టిన వివరాలపై విలేకరుల ప్రశ్నలపై ఎంపీ ఈ విధంగా బదులిచ్చారు. అయితే విచారణంటూ జరిగితే అది కేవలం వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందాలకే పరిమితం కారాదని, అనుమానాస్పద భూ లావాదేవీలన్నింటిపైనా విచారణ జరపాలని సింగ్ కోరారు. ‘‘భూ వాడకంలో మార్పుచేర్పులు, కుంభకోణాలు, అక్రమంగా భారీ సంపదను మూటగట్టుకోవడం వంటి ఆరోపణలు ఏవి వచ్చినా కేవలం సోనియాగాంధీ అల్లుడిపై మాత్రమే కాకుండా అందరి పాత్రపైనా విచారణ జరగాలి. గత ఐదారేళ్లలో గుర్గావ్లోని 21 వేల ఎకరాలను చాలావరకు వ్యవసాయ భూమి నుంచి సెజ్లుగా బదలాయించారు. ఈ ఒప్పందాల వెనక ఉన్న వాస్తవాలన్నీ బయటికి రావాలని నేను కోరుతున్నాను. 2004 నుంచీ ఇలా కేటాయించిన 1,200 ఎకరాలనూ విచారణ పరిధిలోకి తేవాలి’’ అని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన కాంగ్రెస్, వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. సింగ్ తన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చారని, మీడియాలో వస్తున్నట్టుగా తానేమీ మాట్లాడలేదని చెప్పారని ఏఐసీసీ ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందంలో అక్రమాలేమీ లేదని, అయినా దానిపై నిర్ణయాన్ని హర్యానా ప్రభుత్వానికే వదిలేశామని చెప్పుకొచ్చారు. వాద్రాపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ లక్నో: రాబర్ట్ వాద్రాపై వచ్చిన భూ దందా ఆరోపణలపై విచారణ జరపాలంటూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు వాద్రాపై చేసిన చేసిన ఆరోపణలపై విచారణ జరిపిం చాలని సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ అందులో కోరారు. వాద్రా, హర్యానా ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రొ కొ జరిగిన వైనం స్పష్టంగా కన్పిస్తోందని ఆమె ఆరోపించారు.