
పుణె: మూగ, చెవిటి మహిళను 2015లో అత్యాచారం చేశారన్న ఆరోపణలపై నలుగురు ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పుణె శివారుల్లోని ఖడ్కీలో ఉన్న సైనిక ఆసుపత్రిలో సదరు మహిళ ఉద్యోగినిగా ఉండగా నలుగురు సిబ్బంది రేప్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో తనపై జరిగిన దారుణాలను బాధితురాలు సంజ్ఞల భాష నిపుణుడికి వివరించడంతో ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులతోపాటు ఆర్మీ ఈ కేసులో విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment