military hospital
-
గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్
కొలంబో: ఈ నెల ఒకటో తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో సైనిక ఆసుపత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని డాక్టర్లు విజయవంతంగా బయటకుతీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా బయటపడ్డ కిడ్నీ స్టోన్స్లో ఇదే పెద్ద రాయిగా రికార్డుకెక్కింది. ఈ రాయి బరువు 801 గ్రాములు, పొడవు 13.37 సెంటీమీటరు. ఇది రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడం గమనార్హం. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న కిడ్నీ స్టోన్‌ను, 2008లో పాకిస్తాన్లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. శ్రీలంకలో వెలికితీసిన రాయి ఆ రెండింటినీ అధిగమించింది. -
రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు
కీవ్: రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్ అనే ఉక్రెయిన్ సైనికుడి ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంది. ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ ఆ షాకింగ్ ఫోటోలతోపాటు .. రష్యా జెనివా ఒప్పందాలకు కట్టుబడి దాదాపు 204 మంది ఉక్రెనియన్ యుద్ధ ఖైదీలను విడుదల చేసినట్లు పేర్కొంది. నాజీయిజానికి చెందిన వారసత్వాన్ని రష్యా ఇలా కొనసాగిస్తోంది అనే క్యాప్షన్ జోడించి మరీ ఆ సైనికుడు ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న సైనికుడి రూపు చెరలో నుంచి బయటపడిన తర్వాత అత్యంత ఘోరంగా మారిపోయింది. ఆ సైనికుడు ఇతనేనా అనేంత విస్తుపోయేలా దారుణంగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే డయానోవ్ రష్యా చెర నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడినందుకు అదృష్టవంతుడనే చెప్పాలి. కాగా అతను మారయుపోల్లోని అజోవ్‌స్టల్ స్టీల్ వర్క్‌లను రక్షించే నిమిత్తం యుద్ధం చేస్తున్న సమయంలోనే నిర్బంధింపబడ్డాడు. రష్యా విడుదల చేసిన 250 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలలో అతను ఒకడు. ఈ క్రమంలో సదరు యుద్ధ సైనికుడి సోదరి అలోనా నామ్రష్కో మాట్లాడుతూ...అతను ముఖం చేతులపై గాయాలతో కృశించిపోయి ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం డయానోవ్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. పేలుడు పదార్థాలలోని ఒక లోహం అతని చేతిలోకి దిగిపోయిందని, ఐతే దాన్ని వారు ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా తీయడంతో సుమారు 4 సెం.మీ ఎముకను తీసేయాల్సి వచ్చినట్లు వెల్లడించింది. అతని పరిస్థితి చాలా క్రిటకల్‌గా ఉందని, దీర్ఘకాలిక చికిత్స అవసరమని కన్నీటిపర్యంతమయ్యింది. తన సోదరుడు మానసికంగా దృఢంగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, ముఖ్యంగా అతను తిరిగొచ్చినందుకు అత్యంత ఆనందంగా ఉందని చెప్పింది. డయానోవ్ కూడా తాను హాయిగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నాడు. (చదవండి: దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు) -
ఆస్పత్రి బయట ట్రంప్ చక్కర్లు
వాషింగ్టన్: మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఉన్నట్లుండి ఆస్పత్రి బయటకు వచ్చి కారులో తన అభిమానులకు అభివాదం చేస్తూ కలియదిరిగారు. ట్రంప్ చర్య సబబుకాదని మిలటరీ ఆస్పత్రి వైద్యుడు, డెమొక్రాట్లు విమర్శలు చేశారు. అయితే తన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేస్తున్న అభిమానులకు ఉత్తేజం కలిగించేందుకే ఇలా చేసినట్లు ట్రంప్ చెప్పారు. గురువారం ట్రంప్, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే! అనంతరం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తన అభిమానుల కోసం ఆయన బయటకు వచ్చి కలియదిరిగారు. ఇదే వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాస్కు ధరించి కనిపించారు. కరోనాపై పలు అంశాలను ఆస్పత్రిలో చేరడంతో తెలుసుకున్నానని ఆయన చెప్పారు. ఈ చక్కర్లకు తగిన భద్రత కల్పించామని వైట్‌హౌస్ అధికారులు చెప్పారు. మెడికల్ టీమ్ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే ఒకపక్క 2లక్షలకు పైగా ప్రజలు కరోనాతో మరణించారని, ఈ సమయంలో కూడా ట్రంప్ తన ప్రచార యావ వదలడం లేదని డెమొక్రాట్ నేత హకీమ్ జెఫర్రీస్ విమర్శించారు. అదేవిధంగా ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ జేమ్స్ ఫిలిప్స్ సైతం ట్రంప్ చర్యను తప్పుబట్టారు. ఈ పర్యటనతో కరోనా వ్యాప్తి ముప్పు పెరుగుతుందన్నారు. ట్రంప్ చర్యతో ఈ చక్కర్లలో పాల్గొన్న వారంతా 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిఉంటుందన్నారు. ఇది అనాలోచిత చర్యగా విమర్శించారు. డబ్ల్యూహెచ్‌సీఏ సైతం ట్రంప్ చర్యను ఆక్షేపించింది. కాగా, సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని, తదుపరి చికిత్స వైట్ హౌజ్‌లో కొనసాగించవచ్చని డాక్లర్లు కూడా చెప్పారన్నాయి. అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల గడువు కూడా లేకపోవడంతో.. అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. కాగా వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీకి సైతం సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. -
కోలుకుంటున్నాను.. కానీ...
వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వైట్‌హౌస్ కూడా అధ్యక్షుడి ఆరోగ్యంపై పూటకో రకంగా ప్రకటనలు చేయడం, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడంతో ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందా అన్న సందేహాలు అందరినీ వేధించాయి. ప్రధానంగా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ట్రంప్ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని, మరో రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని, తన పేరు బయటకు వెల్లడి చేయొద్దంటూ విలేకరులకు చెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన నేరుగా మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడిని ఆస్పత్రికి తీసుకురావడానికి ముందు ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని, ఆయనకు కృత్రిమంగా శ్వాస అందించామని వెల్లడించారు. వైద్య నిపుణుల సలహా మేరకే ఆయనను మిలటరీ ఆస్పత్రికి తరలించామన్నారు. తన ఆరోగ్యం గురించి అలా మాట్లాడిన మీడోస్పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కాగా ట్రంప్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యబృందం తెలిపింది. రాబోయే రోజుల్లో అసలు పరీక్ష ఈ పరిణామాలతో ట్రంప్ శనివారం స్వయంగా వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి ఒక వీడియో విడుదల చేశారు. నాలుగు నిమిషాలు ఉన్న ఆ వీడియోలో తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అయితే రాబోయే రోజుల్లోనే అసలైన పరీక్ష ఎదురవబోతోందన్నారు. ‘‘నేను ఆస్పత్రికి వచ్చిన సమయానికి నాకు వంట్లో అంతగా బాగా లేదు. కానీ ఇక్కడ చికిత్స మొదలయ్యాక బాగానే ఉంది. నేను కోలుకోవడానికి అందరం కలిసి అత్యంత శ్రమిస్తున్నాం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపడానికి నేను త్వరగా బయటకి రావాలి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘‘నేను కరోనా వైరస్‌తో పోరాడుతున్నాను. త్వరలోనే దానిని ఓడిస్తాను. ఇంకా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాల్సి ఉంది. కానీ అసలు సిసలైన పరీక్ష ముందుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు. ఈ సమయంలో అన్ని వర్గాల వారు నాకు అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మెలానియా కూడా ధైర్యంగా పోరాడుతున్నారు’’ అని ట్రంప్ ఆ వీడియోలో చెప్పారు. తాను గతంలో కరోనా వైరస్‌కు ఇవ్వాల్సిన మందుల గురించి చెబితే అందరూ తనని హేళన చేశారని, ఇప్పుడు అవే ఔషధాలు తనకు ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. ఆ వీడియోలో ట్రంప్ తెల్ల షర్టు, బ్లూ కోటు వేసుకొని ఉన్నారు. ఆయన చూడడానికి బాగానే ఉన్నప్పటికీ, మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఉన్నంత ఉత్సాహం కనిపించలేదు. ఆస్పత్రిలోనే ఉంటూ ట్రంప్ అధ్యక్షుడిగా రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఆరోగ్యం ప్రమాదకరమా? ట్రంప్ వీడియో విడుదల చేయడానికి ముందు వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే అధ్యక్షుడు ఇంకా ప్రమాదం నుంచి బయటడపడలేదని వెల్లడించారు. అయితే ఆస్పత్రి వైద్యులు ట్రంప్ త్వరగా కోలుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారని అన్నారు. గత 24 గంటల్లో ట్రంప్‌కి జ్వరం కూడా రాలేదన్న కాన్లే మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్‌లో ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నాయని తెలిపారు. ట్రంప్‌కి రెమిడెసివిర్ ఇంజెక్షన్ రెండో డోసు ఇచ్చా మని చెప్పారు. మరోవైపు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ కూడా ట్రంప్ బాగా కోలుకుంటున్నారని చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఓ ఇంటర్వ్యూలో..ఆస్పత్రిలో చేరిన తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందన్నారు. వీడియో ఎడిట్ చేశారా? అధ్యక్షుడు ట్రంప్‌కి దగ్గు బాగా ఎక్కువగా ఉందని, ఆ విషయం తెలీకుండా ఆయన విడుదల చేసిన వీడియోని ఎడిట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియో చూసిన నెటిజన్లు ట్రంప్ మధ్యలో కాస్త వెక్కినట్టుగా అనిపించిందని, ఆయన భుజం కూడా కాస్త పైకి కదిలిన శబ్దం వినిపించిందని సందేహాలు వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా దగ్గు వచ్చిందని, అది తెలీకుండా ఆ వీడియోని ఎడిట్ చేసి పోస్టు చేశారని అంటున్నారు. ఎంఏజీఏ ప్రచారం ప్రారంభం కోవిడ్–19తో ట్రంప్ ఆస్పత్రిలో పోరాడుతూ ఉన్న సమయంలోనే ఆయన శిబిరం కొత్త ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) అన్న కలని సాకారం చేసుకోవడానికి ఆపరేషన్ ఎంఏజీఏ పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ట్రంప్ కరోనాతో పోరాడుతున్నప్పటికీ ఏ మాత్రం వెనుకబడి పోకుండా ఉండడానికి స్వింగ్ స్టేట్స్లో ఈ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించనున్నారు. -
మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముందు జాగ్రత్త చర్యగా మిలటరీ ఆస్పత్రికి తరలించారు. వాషింగ్టన్ శివారు ప్రాంతంలోని బెథెస్దాలోని వాల్టర్ రీడ్ మిలటరీ మెడికల్ సెంటర్లో వెద్యులు ఆయనకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తున్నారు. వైట్ హౌస్ నుంచి ‘మెరైన్ వన్’ హెలికాప్టర్లో ట్రంప్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించారు. ట్రంప్ చికిత్సకి బాగా స్పందిస్తున్నారని ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వెల్లడించారు. కరోనా ఇన్ఫెక్షన్కి రెమ్‌డెసివిర్ థెరపీ ఇవ్వాలని వైద్య నిపుణులు సూచించినట్టు కాన్లే తెలిపారు. ‘ట్రంప్‌కు కృత్రిమ ఆక్సిజన్ అవసరం రాలేదు. వైద్య నిపుణులతో సంప్రదించాక రెమ్‌డెసివిర్ థెరపీ మొదలు పెట్టాం.మొదటి డోసు ఇచ్చాం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగుంది’’అని కాన్లే చెప్పారు. కాగా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌కి స్వల్పంగా దగ్గు, తలనొప్పి మాత్రమే ఉండడంతో శ్వేతసౌధంలోనే ఉంచి చికిత్స ఇస్తున్నారు. ట్రంప్ కుటుం బంలో మిగిలిన వారందరికీ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో శ్వేత సౌధం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్‌కి రెజెనెరాన్ కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవ డానికి ట్రంప్‌కి ఇచ్చే చికిత్స వివరాలను డాక్టర్ సీన్ కాన్లే ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా సోకిన విషయం తెలిసిన తర్వాత మొదటి సారిగా రెజెనెరాన్–కోవ్2 పాలిక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ 8 గ్రాముల డోసు ఇచ్చారు. ఈ యాంటీబాడీ కాక్టెయిల్ ఇంకా ప్రయోగ దశలోనే ఉండడం గమనార్హం. శరీర భాగాలపై కరోనా వైరస్ మరింతగా దాడి చేయకుండా ఈ కాక్టెయిల్ రక్షిస్తుందని భావిస్తున్నారు. రెండు మోనోక్లానల్ యాంటీబాడీస్ కాంబినేషన్‌గా ఈ కాక్టెయిల్ను రూపొందించారు. ఈ కాక్టెయిల్ అమెరికాలో ఇంకా మూడో దశ ప్రయోగాల్లోనే ఉంది. దాంతో పాటు జింక్, విటమిన్ డి, ఫామొటైడైన్, మెలాటోనిన్, యాస్పిరిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తూనే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కూడా మొదలు పెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో రెమ్డెసివిర్తో పెద్దగా సత్ఫలితాలు లేవని ట్రంప్ పాలనా యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఇంజెక్షన్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైద్య నిపుణుల సూచనల మేరకే రెమ్‌డెసివిర్ థెరపీ ఇస్తున్నట్టుగా కాన్లే వివరించారు. ట్రంప్ కోలుకోవాలన్న కిమ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా కరోనా నుంచి కోలుకోవాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సందేశం పంపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. 2017లో అణుపరీక్షల విషయమై ట్రంప్, కిమ్ మాటల యుద్ధం చేశారు. అనంతరం ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ట్రంప్ దంపతులు తొందరగా కరోనా నుంచి రికవరీ కావాలని కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. బాగానే ఉన్నా.. తాను బాగానే ఉన్నానని ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు. వాల్టర్ రీడ్ ఆస్పత్రికి చేరగానే ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. మెలానియా బాగానే ఉందని తెలిపారు. ఆస్పత్రిలోని ప్రెసిడెన్షియల్ కార్యాలయం నుంచి ట్రంప్ కార్యకలాపాలు కొన్ని రోజులు నిర్వహిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వైట్ హౌస్‌కు కరోనా దడ వైట్‌హౌస్‌లో పలువురు కరోనా బారిన పడగా, తాజాగా ముగ్గురు వైట్‌హౌస్ జర్నలిస్టులు, ట్రంప్ ప్రచార మేనేజర్, ఇద్దరు సెనేటర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. రిపబ్లిక్ పార్టీకి చెందిన సెనేటర్లు థామ్ టిల్లిస్, మైక్ లీకు కరోనా సోకినట్లు వారే వెల్లడించారు. -
సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో పోరాడి విజయం సాధించి అమరులైన సైనికులకు నివాళిగా ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ.20 లక్షలు విరాళమిచ్చారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన శ్వాసకోçశ సంబంధిత యంత్రాలను కొనుగోలు చేస్తారని అధికారులు వెల్లడించారు. రూ. 20 లక్షలను చెక్కు ద్వారా అందించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ఖర్చులను తగ్గించుకుని ఈ డబ్బును విరాళం ఇచ్చినట్లు చెప్పారు. -
బారులు తీరిన పౌరులు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు. మిలటరీ ఆసుపత్రులు సిద్ధం ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్ మూడు వారాల లాక్డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. స్వస్థత చేకూరిన వారికి స్వాగతం పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు. కోవిడ్ పరిస్థితి స్థూలంగా.. దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. -
మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలకు, పాక్ సైన్యానికి ఉన్న సంబం ధం మరోసారి తేటతెల్లమైంది. ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌కు ఏకంగా రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే స్వయంగా ఒప్పుకున్నారు. కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్(50) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్ర పిండాల వ్యాధితో అతడికి రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో ప్రతిరోజూ డయాలసిస్ జరుగుతోందని పాక్ అధికారులు వెల్లడించారు. మసూద్ తమ దేశంలోనే ఉన్నట్లు ఒప్పుకోవడంతోపాటు తమకు టచ్‌లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శుక్రవారం స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ‘మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాన సైనిక కార్యాలయం రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో రోజూ ఆయనకు డయాలసిస్ జరుగుతోంది’అని అధికారులు తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. పుల్వామా ఘటనకు బాధ్యుడైన మసూద్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మంత్రి.. ఆ ఆరోపణను జైషే మొహమ్మద్ సంస్థ కొట్టిపారేసిందంటూ బదులిచ్చారు. అయితే, పుల్వా మా ఘటన వెనుక తామే ఉన్నామంటూ ఆ సంస్థ ప్రకటించింది కదా అని పేర్కొనగా ఆ సంస్థ పాత్ర ఉందనే విషయం గట్టిగా చెప్పలేమనీ, దానిపై కొన్ని అనుమానాలున్నాయన్నారు. అవిఏమిటనే ప్రశ్నకు మంత్రి ఖురేషి.. తమ ప్రభుత్వం జైషే నాయకులతో మాట్లాడగా వారు ఖండించారని వివరించారు. నిషేధిత సంస్థ నాయకులతో ఎవరు మాట్లాడారన్న ప్రశ్నకు ఆయన.. ‘ఇక్కడి ప్రజలు, వారిని గురించి తెలిసిన వారు’ అంటూ చెçప్పుకొచ్చారు. ఇలా ఉండగా, కరుడు గట్టిన ఉగ్రవాది జైషే మొహమ్మద్ అధినేత ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని అనారోగ్య స్థితికి చేరుకున్నారని పాక్ అధికారులు వెల్లడించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శుక్రవారం మంత్రి ఖురేషి తెలిపిన విషయం తెలిసిందే. జీహాద్ ప్రచారంలో దిట్ట మజూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ సంస్థ కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి యత్నించింది. 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంతోపాటు, ఉడిలోని సైనిక క్యాంపుపై దాడికి పాల్పడింది. కశ్మీర్లో బలగాలపై దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు బాలాకోట్, ఖైబర్ ఫక్తున్వాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపే ఆధారాలను భారత ప్రభుత్వం ఇటీవల పాక్‌కు అందజేసింది కూడా. ఈ సంస్థను అగ్ర దేశాలు నిషేధించాయి. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సన్నిహితుడైన మసూద్‌ను భారత్ కస్టడీ నుంచి విడిపించుకునేందుకు ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1999లో కాందహార్‌కు దారి మళ్లించిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక అతడు జైషే మొహమ్మద్‌ను స్థాపించాడు. 1979–1989 సంవత్సరాల మధ్య అఫ్గానిస్తాన్‌లో తిష్టవేసిన సోవియెట్ రష్యా సేనలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో మసూద్ గాయపడ్డాడు. అనంతరం కరడుగట్టిన చాందసవాదిగా మారిన అతడు ఉగ్ర సంస్థ హర్కతుల్ అన్సార్ కీలక నేతగా మారాడు. మంచి వక్త కూడా అయిన మసూద్ జీహాద్(పవిత్ర యుద్ధం)ను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడి కూడా తన సభ్యులేనంటూ ఈ సంస్థ ప్రకటించుకుంది. దీంతో అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ నేతృత్వంలో నడుస్తున్న బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ సంస్థ స్థావరంపై భారత వైమానిక దళం మెరుపుదాడులు చేపట్టి, తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్‌తో యుద్ధం ఆగదు..: జైషే భారత్–పాక్ దేశాల మధ్య సంబంధాలకతీతంగా భారత్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం (జీహాద్) కొనసాగుతుందని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తీర్మానించిందని భారత నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2017 నవం బర్ 17న పాక్‌లోని ఒకారాలో జరిగిన సమావేశంలో జైషే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఆత్మాహుతి దాడి కుట్రదారుడు, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సారథ్యం లో నిర్వహిస్తోన్న ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులు పొగడ్తల వర్షం కురిపించారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి జైషే మహ్మద్ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఘజ్వా–ఎ–హింద్ (భారత్‌పై ఆఖరి పోరాటం) సాగించాలని ఆ సమావేశాల్లో తీర్మానించింది. జైషే మహ్మద్ సంస్థ నాయకులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మహ్మద్ మసూద్, అబ్దుల్ మాలిక్ తాహీర్‌లు ఈ ఉగ్రవాద సమావేశాలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా నిఘా సంస్థలు వెల్లడించాయి. 2018లో ఆరు రోజుల పాటు జైషే మహ్మద్ ‘షోబే తారఫ్’(డిపార్టమెంట్ ఆఫ్ ఇంట్రడక్ష న్) 65 మంది ఉలేమా (మతగురువు)లతో సహా 700ల మంది ప్రతినిధులతో 13 సమావేశాలు నిర్వహించినట్టు నిఘావర్గాల నివేదికలు బయటపెట్టాయి. మత గురువుల హర్షం...: జైషే సంస్థ 2018, మార్చిలో షోబ–ఎ–తారిఫ్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సియాల్ కోట్ జిల్లాలో 4 రోజుల పాటు 1,500ల మందితో 17 సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. వీటికి హాజరైన 50 మంది మతగురువులు సమావేశాల పట్ల హర్షంవ్యక్తం చేసినట్టు సమాచారం. -
ఆర్మీ సిబ్బందిపై అత్యాచారం కేసు
పుణె: మూగ, చెవిటి మహిళను 2015లో అత్యాచారం చేశారన్న ఆరోపణలపై నలుగురు ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పుణె శివారుల్లోని ఖడ్కీలో ఉన్న సైనిక ఆసుపత్రిలో సదరు మహిళ ఉద్యోగినిగా ఉండగా నలుగురు సిబ్బంది రేప్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో తనపై జరిగిన దారుణాలను బాధితురాలు సంజ్ఞల భాష నిపుణుడికి వివరించడంతో ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులతోపాటు ఆర్మీ ఈ కేసులో విచారణ జరుపుతోంది. -
అమెరికాలో కాల్పుల్లో ముగ్గురి మృతి
లాస్‌ఏంజిలస్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ సైనిక చికిత్సాలయంలోకి చొరబడిన దుండగుడు ముగ్గురు మహిళలను తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దుండగుడు మాజీ సైనికుడని సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నాపా వ్యాలీలో ఉన్న ‘వెటరన్స్ హోమ్ ఆఫ్ కాలిఫోర్నియా’ చికిత్సాలయంలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడి ఏడుగురు మహిళలను బందీలుగా చేసుకున్నాడు. తర్వాత నలుగురిని వదిలేశాడు. సాయంత్రం భద్రతా దళాలు అతను దాక్కొన్న గదిలోకి వెళ్లగా ముగ్గురు మహిళల, అతని మృతదేహాలున్నాయి. వారిని తుపాకీతో కాల్చి తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అతను అదే చికిత్సాలయంలో మానసిక రుగ్మతలకు చికిత్స చేయించుకునేవాడని స్థానిక పత్రిక పేర్కొంది. కాగా, అనూహ్య దాడులను ఎదుర్కొనేందుకు ఫ్లోరిడాలోని పాఠశాలల్లో శిక్షణ పొందిన సిబ్బందికి ఆయుధాలు ఇవ్వడానికి సంబంధించిన బిల్లును చట్టంగా మార్చారు. తుపాకులు కొనడానికి కనీస అర్హత వయసును 18 నుంచి 21 పెంచారు. -
మిలటరీ ఆస్పత్రిలో తనిఖీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రం అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని మిలటరీ ఆస్పత్రిని ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా కల్నల్ అనిల్‌కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందుల కొరత ఉందని వాటిని సమకూర్చాలంటూ ఆయన దృష్టికి మాజీసైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శివప్రసాద్, అబ్దుల్ ఖాదర్, తిమ్మారెడ్డి, పెద్దిరెడ్డి, హుస్సేన్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. -
మిలటరీ ఆస్పత్రిలో ఉగ్రమూక.. భారీ పేలుళ్లు!
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది. కాబూల్‌లోని అతిపెద్ద మిలటరీ ఆస్పత్రి లక్ష్యంగా ఉగ్రవాదులు బుధవారం దాడికి తెగబడ్డారు. అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న నాలుగువేల పడకల సర్దార్ మహమ్మద్ దౌద్ ఖాన్ ఆస్పత్రిలోకి ఐదుగురు సూసైడ్ బాంబర్స్ చొరబడ్డారు. అందులో ఒకడు ఆస్పత్రి గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. అతడు డాక్టర్ దుస్తులు ధరించినట్టు తెలుస్తోంది. మిగతా నలుగురు సూసైడ్ బాంబర్ల ఆస్పత్రిలో చొరబడటంతో లోపల ఉన్న వైద్యులు, సిబ్బంది, రోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సూసైడ్ బాంబర్లను తుదముట్టించేందుకు ప్రస్తుతం భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదులు ఆస్పత్రిలోకి చొరబడ్డారని, ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అఫ్ఘాన్ రక్షణశాఖ తెలిపింది. 'దుండగులు ఆస్పత్రి లోపల ఉన్నారు. మా భద్రత కోసం ప్రార్థించండి' అంటూ ఆస్పత్రి సిబ్బంది ఒకరు ఫేస్బుక్లో పేర్కొన్నారు. గతవారం కాబూల్‌లో జరిగిన తాలిబన్ జంట సూసైడ్ బాంబు పేలుళ్లలో 16మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
ఈ అక్కాచెల్లెళ్లు ఎక్కని ఎత్తుల్లేవు!
తాషీ మాలిక్, నాంగ్‌షి మాలిక్... అక్కాచెల్లెళ్లు... ఇంకా వివరంగా చెప్పాలంటే కవలలు... అయితే ఏమిటంట... అంటారా?...ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ అనూహ్యమైన ఎత్తులకు చేరుతున్నారు... సంకల్పబలంతో ప్రపంచంలోని ఎత్తై శిఖరాలను ధైర్యంగా అధిరోహిస్తున్నారు. అది 1991, జూన్ 21వ తేదీ. ఉత్తరప్రదేశ్‌లో మీరట్ పట్టణంలో మిలటరీ హాస్పిటల్. మిలటరీ అధికారి వీరేంద్రసింగ్ మాలిక్ భార్య అంజు తాపా మాలిక్‌కు తాషీ, నాంగ్‌షి పుట్టారు. కొండెక్కినంత సంతోషపడ్డారు ఆ దంపతులు. ఆ పిల్లలు కూడా పెద్దయ్యాక ‘కొండలెక్కుతాం’ అన్నారు. తల్లి ససేమిరా అంది కానీ తండ్రి మాత్రం ‘మీ ప్రతి అడుగు వెనుక నేనున్నట్లే. ముందు అడుగు వేయండి’ అన్నాడు. ఈ కవల సోదరీమణులు ఇప్పటికే వివిధ ఖండాల్లోని నాలుగు ఎత్తై శిఖరాల మీద భారతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇదీ నేపథ్యం! హర్యానాకు చెందిన వీరేంద్రసింగ్ ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, మణిపూర్‌లు చుట్టి డెహ్రాడూన్‌లో రిటైరయ్యారు. తండ్రితోపాటు ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఈ రాష్ట్రాలన్నీ తిరిగారు. వీటితోపాటు ఎడ్యుకేషన్ టూర్లు, యూత్ ఈవెంట్ల కోసం విదేశాల్లోనూ పర్యటించారు. భరతనాట్యం, పంజాబీ నాట్యం, సల్సా డాన్సు నేర్చుకున్నారు. ఇన్ని సరదాల్లో సరదాగా పర్వతారోహణలోనూ శిక్షణ తీసుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లోని గుల్మార్గ్లో సాహసక్రీడలైన స్కీయింగ్‌లో శిక్షణపొందారు. రెట్టించిన ఉత్సాహంతో శిఖరాల వైపు పయనాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికి వేర్వేరు ఖండాల్లోని నాలుగు పర్వత శిఖరాలను అధిరోహించారు, మరో రెండు పర్వత శిఖరాలు వీళ్ల జాబితాలో ఉన్నాయి. ఆరు శిఖరాల అంచులను తాకిన తరవాత అంటార్కిటికా వైపు దృష్టి సారించనున్నారు. భారత మహిళ శక్తికి ప్రతిరూపం! నిండా పాతికేళ్లు లేవు, సాహస యాత్రలే లక్ష్యంగా సాగిపోతున్నారు తాషీ, నాంగ్‌షి. ‘ఈ శిఖరారోహణ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని అడిగితే ‘‘భారతీయ మహిళ లో అసమాన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ప్రపంచ దేశాలకు నిరూపించాలి. మేము సాధించిన లక్ష్యాలను చూసి భారతీయ మహిళ పెదవులపై చిరునవ్వు విచ్చుకోవాలి. ఆ స్ఫూర్తితో ముందుకు రావాలనేది మా కోరిక’’ అంటారు. ఆహారపానీయాలు ఇలా! ఎత్తుకి వెళ్లేకొద్దీ వాతావరణం అనేక మార్పులకు లోనవుతుంది. ఆ ప్రభావం దేహం మీద తప్పకుండా ఉంటుంది. వాతావరణానికి అనుగుణంగా అన్నపానీయాలలో మార్పులు తప్పనిసరి. ‘‘బేస్ క్యాంపు నుంచి పైకి వెళ్లే కొద్దీ ఘనాహారం తగ్గించి ద్రవాహారం పెంచుకోవాలి. ప్రోటీన్ బార్లు దగ్గరుంచుకోవాలి. ఆక్సిజన్ తగ్గేకొద్దీ శరీరం సహకరించడం మానేస్తుంటుంది. డయామాక్స్ లేదా ఆక్సిజన్ బార్ దగ్గర ఉంచుకోవాలి’’ అంటూ పర్వతారోహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారీ కవలలు. వివక్ష ఉన్న చోట నుంచే ప్రతిభ! ‘‘మా నాన్నకు ముందు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. మా నాన్న పుట్టే వరకు అబ్బాయి కోసం ఎదురు చూశారట మా నానమ్మ, తాతయ్యలు. అలాగే నాన్నకు మేము పుట్టిన తర్వాత కూడా అబ్బాయి కోసం ఎదురుచూడమని ఒత్తిడి చేశారట. మా నాన్న ఆ ఒత్తిడికి తలవంచలేదు. నాన్నకు దూరదృష్టి, విశాల దృక్పథం ఉన్నాయి. ఆడపిల్ల అనే కారణంగా పరిమితులు విధించడం ఆయనకు నచ్చదు. ‘స్త్రీశక్తిని నిరూపించే అవకాశం మీ చేతిలో ఉంది, నిరూపించుకోండి’ అంటారు. ప్రసారమాధ్యమాలు సహకరిస్తే లింగవివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనేదే మా ఆకాంక్ష’’ అంటున్నారు ఈ సోదరీమణులు. ఈ పర్వతారోహకులిద్దరూ ‘మేము సాధించాం, మీరూ అడుగు ముందుకు వేయండి’ అంటూ యువతులలో స్ఫూర్తిని నింపుతున్నారు. వివక్షరహిత సమాజం కావాలంటూ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నారు. - వాకా మంజులారెడ్డి అధిరోహించిన శిఖరాలు... మౌంట్ ఎల్బ్రస్ (18,541 అడుగులు), యూరప్‌లో ఎత్తై శిఖరం మౌంట్ అకాంకాగువా (22, 837 అడుగులు) దక్షిణ అమెరికాలో ఉంది. రెండు అమెరికాల్లోనూ ఇదే ఎత్తై శిఖరం. మౌంట్ ఎవరెస్టు ఎత్తు 29, 029 అడుగులు మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికాలో ఎత్తై శిఖరం) 19, 640 అడుగులు అధిరోహించనున్న శిఖరాలు... మౌంట్ కార్సెంటెంజ్ పిరమిడ్ (16, 024) ఇండోనేసియా మౌంట్ మెక్కిన్లె (20,234 అడుగులు) అలాస్కా, అమెరికా మౌంట్ విన్సన్ మాసిఫ్ (16, 050) అంటార్కిటికా