![ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి](/styles/webp/s3/article_images/2017/09/4/61466861175_625x300.jpg.webp?itok=LsK5xDkI)
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూ కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.