Martyred
-
జేకేలో అమరులైన కెప్టెన్, జవాన్లు వీరే
జమ్ముకశ్మీర్‌లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. -
పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered. — Narendra Modi (@narendramodi) February 14, 2024 జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారత్‌పై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు. -
నిజామాబాద్: జవాన్ వీర మరణం
-
ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం
సాక్షి, నిజామాబాద్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇందూరు బిడ్డ వీరమరణం పొందాడు. దీంతో ఆయన స్వగ్రామం వేల్పూరు మండలం కోమన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేష్ ప్రాథిమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరిగింది. కుకునూర్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. నిజామాబాద్‌లోని ఓ ప్రేవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం కరీంనగర్ మిలిటరీ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయ్యాడు. గతేడాది డిసెంబర్లో ఇంటికి వచ్చి ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాడు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ఇంకా సంతానం కాలేదు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్‌లో విధులు నిర్వర్తించిన మహేష్ బదిలీపై జమ్మూకశ్మీర్‌కు వెళ్లాడు. ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ఈ వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు చిన్నరాజు, గంగమల్లు కన్నీరుమున్నీరయ్యారు. అమర జవాన్‌కు నివాళి జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. ‘వీర సైనికుడు మహేష్‌కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తోంది. ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన మహేష్ తోటి సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ మహేష్ వీర మరణం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేష్ త్యాగం మరువలేనిదని అన్నారు. మహేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహేష్‌తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు పలికారు. (చదవండి: కశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం) -
దారుణం : అమర జవాను భార్యను దోచేశాడు
భోపాల్: పుల్వామా ఉగ్రదాడిలో 43మంది సీఆర్పీఎఫ్ జవానుల మృతిపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతవరణం కొనసాగుతుండగానే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అమర జవాను భార్యను టార్గెట్ చేసిన ఓ దుర్మార్గుడు ప్రభుత్వం ఆమెకిచ్చిన పరిహార సొమ్మును కాజేశాడు. మధ్య ప్రదేశ్‌లోని సెహోర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 2013 శ్రీనగర్‌లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో మధ్యప్రదేశ్‌కు సీఆర్పీఎఫ్ జవాను ఓం ప్రకాశ్ మారదానియా అసువులు బాసారు. అయితే ఆయన భార్య కమల్ బాయికి ప్రభుత్వం రూ.8లక్షలను ఇచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మిశ్రీలాల్ మీనా అనే వ్యక్తి కమలా బాయిని ఈ నెల (ఫిబ్రవరి) 11న కలిశాడు. తను సీఆర్పీఎఫ్కి చెందిన వ్యక్తినని, అమర జవానుల కుటుంబ సంక్షేమ సమాచారం నిమిత్తం ప్రభుత్వం తనను పంపించిందని చెప్పాడు. అలాగే ప్రభుత్వం మరో 34లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 8లక్షల రూపాయలను బ్యాంకునుంచి విత్‌డ్రా చేయాలని ఆమెను నమ్మించాడు. అతని మాటల్ని విశ్వసించిన కమలా బాయి ఆ డబ్బులను విత్ డ్రా చేసి వాడికి ఇచ్చింది. అంతే ఇదే అదనుగా భావించిన అతగాడు అక్కడ్నుంచి ఉడాయించాడు. మరోవైపు కమలా బాయి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రతి మూడునెలలకు ఒకసారి అమర జవానుల కుటుంబాన్ని సీఆర్పీఎఫ్ పరామర్శింస్తుందన్న విషయం తెలిసిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడి వుంటారని భావిస్తున్నామన్నారు. ఈ కేసు విచారణలో అటు సీఆర్పీఎఫ్ కూడా తమతో సహకరిస్తోందని సెహోర్ అదనపు ఎస్పీ సమీర్ యాదవ్ వెల్లడించారు. -
వీరజవాన్ మన్‌దీప్‌కు కన్నీటి వీడ్కోలు
-
ఆ చిన్న రైతు కొడుకులిద్దరూ దేశం కోసమే..
రగ్దు తోలా(అరా): కన్నబిడ్డలు తాను బతికుండగానే చనిపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఆ కడుపుకోత కడవరకు అంటిపెట్టుకుని ఉంటుంది. పలు సందర్భాలు ఆ విషయం కడుపులో పొర్లి ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీరుగా బయటకొస్తుంది. ఒక్కోసారి గుండె ఆగిపోయేంత పనిచేస్తుంది. అయితే, అదే దుఃఖానికి కొంత గర్వం తోడవ్వాలంటే.. ఆ చనిపోయిన బిడ్డ ప్రాణాలు ఒక త్యాగం కోసం అయి పోయి ఉండాలి. అచ్చం ఇలాంటి పరిస్థితే బిహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చిన్న రైతుకు ఎదురైంది. తన కుమారుడు చనిపోయాడన్న గుండెకోత ఓ పక్కన.. దేశం కోసం త్యాగం చేశాడనే గర్వం మరోపక్క. అవును ఆయన కుమారుడు ఓ సైనికుడు. ఈ ఒక్క కుమారుడే కాదు. ఆయన పెద్ద కుమారుడు కూడా సైనికుడే.. ఆ కుమారుడు కూడా దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరూ కూడా సైనికులే. బిహార్ లోని రగ్దు తోలా అనే గ్రామంలో జయనారాయణ్ సింగ్ కు ఇద్దరు కుమారులు. ఒకరు కమతా సింగ్ కాగా మరొకరు అశోక్ కుమార్ సింగ్. వీరిద్దరు ఆర్మీలోనే చేరారు. వీరిలో కమతా సింగ్ 1986లో రాజస్థాన్‌లో జరిగిన మిలటరీ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందగా తాజాగా.. యూరీ సెక్టార్ లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో హవాల్ దార్ అశోక్ కుమార్ సింగ్(50) ప్రాణాలుకోల్పోయాడు. ఈ సందర్భంగా అశోక్ సింగ్ భార్య కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. పాశవికంగా జరిపిన ఈ దాడికి దేశం బదులుతీర్చుకోవాల్సిందేనని చెప్పింది. మరో విశేషమేమిటంటే అశోక్ పెద్ద కుమారుడు కూడా ఆర్మీలోనే చేరాడంట. -
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూ కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. -
పోలీసు అమరవీరులు దేవుళ్లతో సమానం: కేసీఆర్
* పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి * విధి నిర్వహణలో మరణి ంచినవారికి నష్టపరిహారం పెంపు * ఎస్సైలకు రూ.45 లక్షలు, సీఐ ఆపై స్థాయి వారికి రూ.50 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి పరిహారం * ఏటా 20 మంది ఉత్తమ పోలీసులకు రూ.5 లక్షల నగదు రివార్డు * పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన * అమరవీరులు దేవుళ్లతో సమానమంటూ ప్రశంసలు సాక్షి, హైదరాబాద్: పోలీసులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. బతికున్న వారి కోసం తమ బతుకులను త్యాగం చేసే వారు దేవుళ్లతో సమానమని, పోలీసు అమరవీరులు ఆ కోవకు చెందుతారంటూ ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి నెల కొంటేనే అభివృద్ది సాధ్యమని, అందుకు పోలీసు శాఖకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేందుకైనా సిద్ధమని స్పష్టంచేశారు. గోషామహల్ స్టేడియం లో మంగళవారం జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను సవ్యంగా ఉంచాలని పిలుపుని చ్చారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్న పోలీసులను.. ఖాకీలంటూ సినిమాల్లో, పత్రికలలో ఎగతాళి చేయడం సరికాదని కేసీఆర్ అన్నారు. ఏటా తెలంగాణ పోలీసు మెడల్స్ పోలీసుల జీత భత్యాలు పెంచే విషయంలో గత ప్రభుత్వాలు చులకనగా చూసేవని, కానీ తమ ప్రభుత్వం అందుకు వ్యతిరేకమన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులతో పోరాడుతూ అసువులు బాసిన కానిస్టేబుళ్లు మొదలుకుని ఏఎస్సై స్థాయి వరకు వారికిచ్చే నష్ట పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్సైలకు రూ.45 లక్షలు, సీఐ ఆపై స్థాయి అధికారులకు రూ.50 లక్షలుగా నిర్ణయించామని వెల్లడించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన ఐపీఎస్ అధికారులకు ఇప్పటివరకు అందచేసే నష్టపరిహారాన్ని రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆరో గ్య భద్రత కింద పోలీసులకు ఇదివరకు ఇస్తున్న లక్ష రూపాయలను రూ.5 లక్షలకు పెంచామని, రూ. 2.50 లక్షలు ఉన్న పరిధిని రూ.7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. పోలీసులకు ఇచ్చే రోజు వారీ భత్యాన్ని రూ.90 నుంచి రూ.250కి పెంచుతున్నట్లు చెప్పారు. అమరులైన పోలీసులకు వారి పదవీ విరమణ వరకు పూర్తి జీతంతోపాటు సొంత ఇల్లును కూడా కట్టించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసులకు తెలంగాణ పోలీసు మెడల్స్‌ను ప్రతి ఏటా ప్రధానం చేసి, రూ.5 లక్షల నగదు రివార్డు అందచేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వారి త్యాగాల ఫలమే: నాయిని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడు తూ.. పోలీసుల త్యాగాల కారణంగానే శాంతి యుత వాతావరణంలో బతుకుతున్నామన్న సం గతిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. పోలీ సుల త్యాగాలను ప్రజలు గుర్తించాలని డీజీపీ అనురాగ్ శర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీసు శాఖ పటిష్టతకు సీఎం అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఎస్సై రాములు, కానిస్టేబుళ్లు బసు, ఈశ్వరయ్యలకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ‘అమరులు వీరు’ అనే అనుబంధ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సాయుధ పోలీసు బలగాలు నిర్వహించిన కవాతు, పోలీసు బ్యాండు అమరవీరులను శ్లాఘిస్తూ వినిపిం చిన వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోలీసు అమరవీరులను కీర్తిస్తూ చిన్నారులు పెయింటింగ్‌లు, క్యారికేచర్లు వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఐపీఎస్ అధికారులు, నగర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సీఎం ప్రసంగంలో మా ప్రస్తావనేదీ..? అమరవీరుల సంస్మరణ సందర్భంగా పోలీసులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తుంటే.. తమ గురించి మాట మాత్రమైనా ప్రస్తావించకపోవడంపై మహిళా హోంగార్డులు కన్నీరు పెట్టుకున్నారు. గోషామహల్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ పరేడ్‌లో పోలీసులకు ఆర్థికంగా లబ్ధిచేకూర్చే ప్రకటనలతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమకూ సీఎం వరాలిస్తారని మహిళా హోంగార్డులు ఎదురుచూస్తూ ప్రసంగం ఆసాంతం ఆసక్తిగా విన్నారు. అలాం టిదేమీ లేకుండా కేసీఆర్ ప్రసంగాన్ని ముగించడంతో నిరాశకు గురయ్యారు. ఉచిత వైద్య పరీక్షలు.. విధి నిర్వహణలో పోలీసులు వివిధ వ్యాధుల బారినపడుతున్నారని, వ్యాధి లక్షణాలను ఆదిలోనే కనిపెట్టడానికి 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి పోలీసుకు ఆరునెలలకు ఒకసారి సంపూర్ణ వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని సీఎం తెలిపారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఎస్సై, ఆర్ఎస్ఐలకు గెజిటెడ్ హోదాకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్ర పోలీసు క్యాంటీన్లలో ఖరీదు చేసే వస్తువులపై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలియచేశారు. మహిళలు అర్థరాత్రి స్వేచ్చగా తిరిగే వ్యవస్థ కోసం సింగపూర్‌లాంటి భద్రతా వ్యవస్థ ఇక్కడ కూడా ఏర్పాటు కావాల్సి ఉందని నొక్కి చెప్పారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రతా సేవలు అందించే పోలీసులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంపై నివేదిక అందించాల్సిందిగా డీజీపీకి సూచించారు. దిల్సుఖ్నగర్ వంటి బాంబు పేలుళ్ల ఘటనలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఐటీ కంపెనీల వారిని పునరాలోచింప చేస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ పోలీసులు ప్రజాబంధువులుగా నిలవాలని కోరారు.