రగ్దు తోలా(అరా): కన్నబిడ్డలు తాను బతికుండగానే చనిపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఆ కడుపుకోత కడవరకు అంటిపెట్టుకుని ఉంటుంది. పలు సందర్భాలు ఆ విషయం కడుపులో పొర్లి ఉక్కిరిబిక్కిరి చేసి కన్నీరుగా బయటకొస్తుంది. ఒక్కోసారి గుండె ఆగిపోయేంత పనిచేస్తుంది. అయితే, అదే దుఃఖానికి కొంత గర్వం తోడవ్వాలంటే.. ఆ చనిపోయిన బిడ్డ ప్రాణాలు ఒక త్యాగం కోసం అయి పోయి ఉండాలి. అచ్చం ఇలాంటి పరిస్థితే బిహార్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చిన్న రైతుకు ఎదురైంది.
తన కుమారుడు చనిపోయాడన్న గుండెకోత ఓ పక్కన.. దేశం కోసం త్యాగం చేశాడనే గర్వం మరోపక్క. అవును ఆయన కుమారుడు ఓ సైనికుడు. ఈ ఒక్క కుమారుడే కాదు. ఆయన పెద్ద కుమారుడు కూడా సైనికుడే.. ఆ కుమారుడు కూడా దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరూ కూడా సైనికులే. బిహార్ లోని రగ్దు తోలా అనే గ్రామంలో జయనారాయణ్ సింగ్ కు ఇద్దరు కుమారులు. ఒకరు కమతా సింగ్ కాగా మరొకరు అశోక్ కుమార్ సింగ్.
వీరిద్దరు ఆర్మీలోనే చేరారు. వీరిలో కమతా సింగ్ 1986లో రాజస్థాన్లో జరిగిన మిలటరీ ఆపరేషన్లో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందగా తాజాగా.. యూరీ సెక్టార్ లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో హవాల్ దార్ అశోక్ కుమార్ సింగ్(50) ప్రాణాలుకోల్పోయాడు. ఈ సందర్భంగా అశోక్ సింగ్ భార్య కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. పాశవికంగా జరిపిన ఈ దాడికి దేశం బదులుతీర్చుకోవాల్సిందేనని చెప్పింది. మరో విశేషమేమిటంటే అశోక్ పెద్ద కుమారుడు కూడా ఆర్మీలోనే చేరాడంట.
ఆ చిన్న రైతు కొడుకులిద్దరూ దేశం కోసమే..
Published Tue, Sep 20 2016 9:39 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement