
ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లు, పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. బారాముల్లా సెక్టార్‌లో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై తెల్లవారుజామున 2. 30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల సహా ఒక పోలీస్ అధికారి మృతిచెందినట్టు తెలిపారు. మరో ఐదుగురు అధికారులకు గాయాలు అయినట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు ఆర్మీ అధికారుల కుంబింగ్ కొనసాగుతోంది.