
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా పాంపోర్‌లోని కందిజల్ బ్రిడ్జిపై జమ్ము కశ్మీర్ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విధినిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. చదవండి : ‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’
Comments
Please login to add a commentAdd a comment