
ఫ్లోరెన్స్: సౌత్ కరోలినా రాష్ట్రం ఫ్లోరెన్స్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వింటేజ్ ప్లేస్ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్ హాప్కిన్స్(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లారు.
వారిని దూరం నుంచి చూసిన హాప్కిన్స్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపా టు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్‌పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పోలీసు అధికారి టెరెన్స్ కరావే(52) అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment