అమెరికాలో ఉన్మాది ఘాతుకం మృతుల్లో ఉన్మాది?
మాడిసన్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని సోమవారం ఒక స్కూలులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో కాల్పులకు తెగబడ్డ ఉన్మాది కూడా ఉన్నట్లు సమాచారం. మాడిసన్‌లోని అబుండంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
కాల్పులకు తెగబడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు క్రియాశీలకంగా ఉన్నారా? ఆయుధాలతో ఉన్నారా? అనేది పోలీసులు ధ్రువీకరించునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్కూలులో కిండర్ గార్డెన్ నుంచి పదో తరగతి దాకా మొత్తం 390 మంది చదువుతున్నట్లు పాఠశాల వెబ్‌సైట్లో ఉంది. ఇతర అత్యవసర విభాగాలకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగి స్థానిక యంత్రాంగానికి అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment