Wisconsin shootings
-
స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
మాడిసన్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని సోమవారం ఒక స్కూలులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో కాల్పులకు తెగబడ్డ ఉన్మాది కూడా ఉన్నట్లు సమాచారం. మాడిసన్లోని అబుండంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. కాల్పులకు తెగబడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు క్రియాశీలకంగా ఉన్నారా? ఆయుధాలతో ఉన్నారా? అనేది పోలీసులు ధ్రువీకరించునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్కూలులో కిండర్ గార్డెన్ నుంచి పదో తరగతి దాకా మొత్తం 390 మంది చదువుతున్నట్లు పాఠశాల వెబ్సైట్లో ఉంది. ఇతర అత్యవసర విభాగాలకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగి స్థానిక యంత్రాంగానికి అండగా నిలిచారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. విస్కాన్సిన్లోని ఒక మాల్లో శుక్రవారం కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. విస్కాన్సిన్లోని వావటోసాలోని మేఫేర్ మాల్లో శ్వేతజాతి యువకుడి కాల్పులు జరిపి పారిపోయినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వారిలో ఏడుగురు పెద్దలు, ఒక యువకుడు ఉన్నారు. షూటర్ కోసం గాలిస్తున్నామని వావటోసా పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత!
అమెరికాలోని విస్కాన్సిన్లో మళ్లీ కాల్పులు మోత మోగింది. ఉత్తర విస్కాన్సిన్లో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితోపాటు మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఓ బ్యాంకులో జరిగిన కుటుంబ వివాదం కారణంగా నిందితుడు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఎవరెస్ట్ మెట్రో పోలీసు చీఫ్ వ్యాలీ స్పార్క్స్ వెల్లడించారు. నిందితుడి గురించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో విస్కాన్సిన్లోని ఓ బ్యాంకులో, ఓ న్యాయసేవల సంస్థలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర ఎదురుకాల్పుల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.