
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. విస్కాన్సిన్‌లోని ఒక మాల్‌లో శుక్రవారం కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
విస్కాన్సిన్‌లోని వావటోసాలోని మేఫేర్ మాల్‌లో శ్వేతజాతి యువకుడి కాల్పులు జరిపి పారిపోయినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వారిలో ఏడుగురు పెద్దలు, ఒక యువకుడు ఉన్నారు. షూటర్ కోసం గాలిస్తున్నామని వావటోసా పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment