ట్రంప్‌పై ఆరురౌండ్ల కాల్పులు.. ఖండించిన ప్రముఖులు | Donald Trump Injured In Shooting At His Rally In Pennsylvania, Suspected Gunman Killed | Sakshi
Sakshi News home page

Donald Trump Fire Incident: ట్రంప్‌పై ఆరురౌండ్ల కాల్పులు.. ఖండించిన ప్రముఖులు

Published Sun, Jul 14 2024 8:14 AM | Last Updated on Sun, Jul 14 2024 10:54 AM

Donald Trump Injured In Shooting At His Rally In Pennsylvania

వాషింగ్టన్ డీసీ : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి.పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దుండగులు ఆరురౌండ్లు కాల్పులు జరిపారు. ట్రంప్‌ ప్రసంగిస్తున్న సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. కాల్పులు జరిపిన వెంటనే అప్రమత్తమైనా భద్రతా సిబ్బంది నిందితుల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు సమాచారం.

ఇక ట్రంప్‌పై జరిగిన దాడిన అధ్యక్షుడు బైడెన్‌ త్రీవంగా ఖండించారు.  ఇది సరైనది కాదు.ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలి అని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో త్వరలో మాట్లాడతానని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.-జో బైడెన్

వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ట్రంప్‌ తర్వగా కోలుకోవాలి.ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.- కమలా హారిస్‌

మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు ఖచ్చితంగా చోటు లేదంటూ ట్రంప్‌పై జరిపిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు.- బరాక్‌ ఒబామా  

ట్రంప్‌పై దాడిని జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ పిరికి పందచర్యగా అభివర్ణించారు.- జార్జ్‌బుష్‌

ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని అపరకుబేరుడు మస్క్‌ ఆకాంక్షించారు. కాల్పుల తర్వాత ఓ చేత్తో రక్తమోడుతున్న తన చెవికి అడ్డుపెట్టుకోగా మరో చేత్తో పిడికిలి బిగించిన ట్రంప్‌ ఫొటోని ఆయన షేర్‌ చేశారు.- ఎలాన్‌ మస్క్‌   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement