
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో జరిగిన జునెటీన్ వేడుకల సందర్భంగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు.. ఓక్‌లాండ్‌లోని లేక్ మెరిట్ వద్ద జరిగిన బుధవారం జునెటీన్ వేడుకకు 5,000 మందికి పైగా హాజరయ్యారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న కార్యక్రమలో ఒకస్కారిగా హింస చెలరేగింది. దాదాపు రాత్రి 8.15 గంటలకు రోడ్డుపక్కన ఉన్న కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఆ తర్వాత జనం గుమిగూడారని, ఈ సందర్భంగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు,
Comments
Please login to add a commentAdd a comment