Florence
-
కొడుకును కాపాడాలనుకుంది.. కానీ
నార్త్ కరోలినా : అమెరికాలో బీభత్సం సృష్టించిన ఫ్లోరెన్స్ హారికేన్ దాటి నుంచి కొడుకును రక్షించుకోలేక పోయిన ఓ తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తుపాను కొనసాగుతున్న సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చిన్నారి ప్రాణాలు తీసిందనే కారణంతో ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర రోలినాకు చెందిన దజియా లీ చార్లెట్ అనే మహిళ తన ఏడాది కొడుకుతో పాటు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు కారులో బయల్దేరింది. అయితే ఆ సమయంలో హారికేన్ ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చరించినా వినకుండా మూసి ఉన్న రహదారి గుండా కారును పోనిచ్చింది. ఈ క్రమంలో వరద ఉధృతి తీవ్రమవడంతో ఓ చోట కారును నిలిపివేసింది. అక్కడి నుంచి బయటపడే క్రమంలో తన చిన్నారిని ఎత్తుకుని కారులో నుంచి దిగింది. కానీ ప్రమాదవశాత్తు ఈ ఆ చిన్నారి వరదలో పడి కొట్టుకుపోయాడు. మరుసటి రోజు చిన్నారి శవాన్ని పోలీసులు వెలికితీశారు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో చార్లెట్‌కు 16 నెలల శిక్ష విధించే అవకాశం ఉందని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యూనియన్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ అధికారులు పేర్కొన్నారు. (అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం) కాగా చార్లెట్‌పై కేసు నమోదు చేయడంపై ఆఫ్రికన్ అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తన బిడ్డను కాపాడుకునే క్రమంలో దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోతే..తప్పంతా ఆమెదేనన్నట్లు ప్రచారం చేయడం, శిక్ష పడేలా చూస్తామనడం నల్లజాతీయుల పట్ల వివక్షకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడిన ఆ మహిళకు తగిన శాస్తి జరిగిందని, అమెరికా చట్టాలు ఇటువంటి విషయాల్లో ఎవరినీ ఉపేక్షించవని మరికొందరు చార్లెట్‌ను వ్యతిరేకిస్తున్నారు. -
అమెరికాలో మాజీ సైనికుడి కాల్పులు.. పోలీసు మృతి
ఫ్లోరెన్స్: సౌత్ కరోలినా రాష్ట్రం ఫ్లోరెన్స్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వింటేజ్ ప్లేస్ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్ హాప్కిన్స్(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. వారిని దూరం నుంచి చూసిన హాప్కిన్స్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపా టు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పోలీసు అధికారి టెరెన్స్ కరావే(52) అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఫిలిప్పీన్స్‌లో భారీ టైఫూన్
హాంకాంగ్/బీజింగ్ /న్యూబెర్న్: శక్తిమంతమైన టైఫూన్ మంగ్‌ఖుట్ ఫిలిప్పీన్స్‌లో పెను విధ్వంసం సృష్టించింది. మంగ్‌ఖుట్ ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో 64 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఈ టైఫూన్ క్రమంగా చైనా, హాంకాంగ్‌లపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో చైనాలోని గ్వాంగ్డాంగ్, గ్వాంగ్షీ, హైనన్, గ్వెజో ప్రావిన్సులతో పాటు హాంకాంగ్‌లో గంటకు 162 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు కుంభవృష్టి కురుస్తోంది. ఈ టైఫూన్ కారణంగా చైనాలో ఇప్పటివరకూ ఇద్దరు చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్సుపై ఈ టైఫూన్ తీవ్ర ప్రభావం చూపొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 24.5 లక్షల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేటకు వెళ్లిన 48,000 పడవలను వెనక్కు రప్పించారు. హైనన్ ప్రావిన్సులో 632 పర్యాటక ప్రాంతాలను, తీరప్రాంత రెస్టారెంట్లను మూసివేసిన అధికారులు, రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 400 సర్వీసులను రద్దుచేశారు. సూపర్మార్కెట్లకు పోటెత్తిన ప్రజలు.. మంగ్‌ఖుట్ టైఫూన్ విధ్వంసం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న భయంతో ప్రజలు సూపర్మార్కెట్ల నుంచి భారీగా ఆహారపదార్థాలను కొనుగోలు చేశారు. దీంతో షాపుల ముందు భారీ క్యూలు దర్శనమిచ్చాయి. చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మకావూలో 20,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికాలో 13కు చేరుకున్న మృతులు.. ఫ్లోరెన్స్ హరికేన్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ప్రస్తుతం దీని తీవ్రత ‘ఉష్ణ మండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కరోలినాలో కుంభవృష్టి కొనసాగుతోందనీ, కొన్ని ప్రాంతాల్లో 90 సెం.మీ మేర వర్షం కురిసిందని వెల్లడించారు. అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఎంగిల్హార్డ్ పట్టణాన్ని ముంచెత్తిన హరికేన్ ఫ్లోరెన్స్ వరద నీరు -
అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం
విల్మింగ్టన్: అమెరికా తూర్పుతీరాన్ని తాకిన ఫ్లోరెన్స్ హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. ఫ్లోరెన్స్ కారణంగా ఇప్పటివరకూ అమెరికాలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ట్రెంట్, నూస్ నదులు పొంగిపొర్లుతుండటంతో ఉత్తర కరోలినాలోని న్యూబెర్న్ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరదలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. న్యూబెర్న్ నుంచి ఇప్పటివరకూ 400 మందిని రక్షించామనీ, మిగిలినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కాగా, ఫ్లోరెన్స్ హరికేన్ తీవ్రత ‘ఉష్ణమండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ గంటకు 112 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, కుంభవృష్టి సంభవిస్తుందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. మరోవైపు ఈ విషయమై ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ స్పందిస్తూ.. ‘ఫ్లోరెన్స్ విధ్వంసం మరో 2–3 రోజులు కొనసాగే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 7.6 లక్షల మంది చీకట్లో మగ్గుతుండగా, 21,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఫ్లోరెన్స్ ప్రభావంతో కుంభవృష్టి కురవడంతో పాటు అకస్మాత్తుగా వరదలు పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఫ్లోరెన్స్ దెబ్బకు అతలాకుతలమైన ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని దాదాపు 17 లక్షల మంది ప్రజలను అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఫ్లోరెన్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అమెరికా విపత్తు నిర్వహణా సంస్థ(ఫెమా)ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఫిలిప్పీన్స్ అతలాకుతలం మనీలా: మంగ్‌ఖుట్ టైఫూన్ ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ 12 మంది దుర్మరణం చెందగా, ఆరుగురు గల్లంతయ్యారు. గంటకు 170 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సహాయక చర్యల కోసం రెండు సీ–130 హెర్క్యులస్ విమానాలతో పాటుæహెలికాప్టర్లను అందు బాటులో ఉంచారు. 50 లక్షల మందిపై టైఫూన్ ప్రభావం చూపుతోంది. -
ఫ్లోరెన్స్.. కేటగిరీ–4 తుపాను
విల్మింగ్టన్: అమెరికాకు పెనుముప్పుగా పొంచి ఉన్న కేటగిరీ–4 భీకర తుపాను ఫ్లోరెన్స్ గంటకు 225 కి.మీ. వేగంతో కరోలినా తీరానికి చేరువగా వచ్చింది. అప్రమత్తమైన తీర ప్రాం తంలోని ప్రజలు నిత్యావసరాలను వెంట తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీరు, ఆహారం, ఇతర తినుబండారాలు కొనేందుకు ప్రజలు మార్ట్ల ముందు బారులు తీరారు. చాలా దుకాణాల్లో ఇప్పటికే సరుకు నిల్వలు అయిపోయాయి. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం హరికేన్ తూర్పు తీరాన్ని తాకొచ్చని అంచనా. ఆ తరువాత దాని ఉధృతి తగ్గి 30–60 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరించారు. దీని ఫలితంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడంతో పాటు, పర్యావరణం మీద కూడా భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అత్యంత ప్రమాదకర కేటగిరీ–4కు చెందిన హరికేన్లు తూర్పు తీరాన్ని తాకడం అరుదని ఐరాస పేర్కొంది. -
అమెరికాను వణికిస్తున్న హరికేన్ ఫ్లోరెన్స్
-
దూసుకొస్తున్న ‘ఫ్లోరెన్స్’
మియామి: అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ‘ఫ్లోరెన్స్’ హరికేన్ అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతోంది. ప్రస్తుతం అమెరికా తూర్పు తీరంవైపు కదులుతున్న ఈ కేటగిరి–1 హరికేన్ క్రమంగా శక్తి పుంజుకుంటోందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి నాటికి ఇది కేటగిరి–4 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వెల్లడించింది. దీని కారణంగా అమెరికా తూర్పుతీరంలో ఉన్న రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో కొండ చరియలు విరిగిపడతాయని హెచ్చరించింది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100 కి.మీ ఆగ్నేయంగా ఈ హరికేన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరెన్స్ విధ్వంసం 2–3 రోజుల పాటు కొనసాగవచ్చని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఉత్తర కరోలీనా, వర్జీనియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కరోలీనా రాష్ట్రాల మధ్య హరికేన్ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశముందంది. ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో కొత్తగా ఐజాక్, హెలెన్ హరికేన్లు ఏర్పడినప్పటికీ, ఇవి అమెరికా తీరంవైపు రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపింది. ఫ్లోరెన్స్ హరికేన్‌ను ఎదుర్కొనేందుకు దక్షిణ కరోలినా, వర్జీనియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. -
25 మంది మృగాళ్లకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు
ఫ్లోరెన్స్ : వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తనను 25 మంది మృగాళ్లు వెంటాడినట్లు, వారి నుంచి ఓ బంగ్లాదేశీయుడు ఆమెను రక్షించినట్లు సోషల్‌మీడియా వేదికగా ఓ మహిళ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఫ్లోరెన్స్ నగరంలోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తనను 25 మంది మృగాళ్లు వెంటాడారని గైయా గ్వార్నోటా అనే మహిళ తెలిపింది. తనను చుట్టుముట్టిన వాళ్లు పక్కకు రావాలంటూ ఒత్తిడి చేశారని చెప్పింది. తాను రానని చెప్పడంతో వారందరూ కోపంతో ఊగిపోయారని, గుంపులో ఇద్దరు తనపై ఉమ్మబోయారని తెలిపింది. మద్యాన్ని తనపై పోశారని, ఆ సన్నివేశాన్ని మొబైల్స్‌లో బంధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పింది. తనను బలవంతం చేస్తుండగా.. ఆ ప్రాంతంలో పూల షాపు నడుపుతున్న బంగ్లా జాతీయుడు కాపాడినట్లు వివరించింది. తనను రక్షించిన అలంగిర్.. తిండి పెట్టి, ఓ పువ్వు ఇచ్చారని పేర్కొంది. అలంగీర్ కనుక రక్షించి ఉండకపోతే తన పరిస్థితిని ఊహించుకోలేకపోతున్నానని వివరించింది. అలంగీర్ ముఖాన్ని తన జీవితంలో మర్చిపోనని తెలిపింది. -
నా పరుగు ఆగిపోలేదు
ఆటకు అందం జత చేరితే అది అచ్చు అశ్వని నాచప్పలా ఉంటుంది. పాతికేళ్ల క్రితమే ఆమె క్రీడా గ్లామర్‌కు ఓనమాలు నేర్పింది. ఒకప్పటి అందాల అమెరికన్ అథ్లెట్ ఫ్లోరెన్స్ జాయ్నర్ తరహాలో ఇండియన్ ఫ్లోజోగా గుర్తింపు తెచ్చుకుంది. అదే సౌందర్యం ఆమెను సినీ తారను చేసింది. పరుగులో పీటీ ఉషను వెనక్కి నెట్టినా...ఆటకంటే అందమే ఆమెను ఎక్కువ సార్లు అందలమెక్కించింది. ఈ ‘కన్నడ కస్తూరి’ ఇప్పటికీ క్రీడలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్లలకు చేయూతనివ్వడం తనకు ప్రస్తుతం అత్యంత సంతృప్తినిస్తోందంటూ అశ్వని చెప్పిన అనేక విశేషాలు ఆమె మాటల్లోనే... అథ్లెటిక్స్ తర్వాత... ట్రాక్‌కు దూరమైనా...నేను ఆటకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే గతంలోకంటే ఎక్కువగా బిజీ అయ్యాను. ముఖ్యంగా నా సొంత స్కూల్, స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా స్వస్థలం కొడగులో 30 ఎకరాల విస్తీర్ణంలో ఐసీఎస్ఈ స్కూల్ ఒకటి నేను నిర్వహిస్తున్నాను. అక్కడ రెగ్యులర్ స్టడీస్‌తో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం అథ్లెటిక్స్,హాకీ, 10 మీ. ఎయిర్ రైఫిల్ క్రీడాంశాలు ఉన్నాయి. అంతే కాదు...పరిక్రమ అనే స్వచ్ఛంద సేవా సంస్థను గత 12 ఏళ్లుగా నడిపిస్తున్నాను. ఇందులో వేయికి పైగా చిన్నారులకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా సంతృప్తినిస్తున్న కార్యక్రమంగా చెప్పవచ్చు. ఆటలకు సంబంధించి... స్పోర్ట్స్ ఫౌండేషన్ మాత్రం పూర్తి స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే పనిలో ఉంది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో టాలెంట్ సెర్చ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు ఉన్నారు. గత నాలుగేళ్లుగా మా ఫౌండేషన్‌కు చెందిన అనేక మంది అథ్లెట్లు జాతీయ స్థాయిలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇకపై మరిన్ని మంచి ఫలితాల సాధనపై దృష్టి పెట్టాను. కిరణ్ మజుందార్‌షా తదితర కార్పొరేట్ దిగ్గజాలు నాకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. బెంగళూరు జిల్లాతో పాటు కర్ణాటక అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా ఆటతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. నాటి గుర్తులు ఒక అథ్లెట్‌గా నేను సంతృప్తికరంగానే కెరీర్‌ను ముగించానని భావిస్తున్నాను. ఆసియా, శాఫ్ క్రీడల్లో పతకాలైనా, ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఇతర విజయాలైనా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి సౌకర్యాలవంటివాటితో పోలిస్తే మేం పరిమిత అవకాశాలతోనే సత్తా చాటామని చెప్పగలను. ఆనాడు పీటీ ఉష స్థాయి ఏమిటో అందరికీ తెలుసు. నేషనల్స్‌లో రెండు సార్లు ఆమెను ఓడించగలిగాను. సహజంగానే చాలా మంది అథ్లెట్లలాగే గాయాలు నా కెరీర్ కీలక దశలో ఇబ్బంది పెట్టడంతో పరుగుకు బ్రేక్ వేయాల్సి వచ్చింది. తొలి సినిమా అనుభవం నా జీవితంలో అదో ప్రత్యేక దశ. నటన గురించి ఏ మాత్రం తెలియని సమయంలో నా స్టోరీ అంటూ చెప్పేసరికి అశ్వినిలో అథ్లెట్‌గా నటించాను. నేను జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. అలాంటిది ఆ సమయంలో ఏడుపు సన్నివేశాల్లో కూడా నవ్వుతూ నేను భానుచందర్‌ను, దర్శకుడిని సతాయించిన రోజులు బాగా గుర్తున్నాయి. అయితే ఆ తర్వాత అందరూ నన్ను ప్రతీ సినిమాలో పరుగెత్తాలనే కోరుకునేవారు. ఈ సమయంలో నేనే కాదు, యూనిట్ మొత్తానికి ఉదయమే రన్నింగ్, ఎక్సర్సైజ్ ఉండేది. అందరినీ తీసుకొని నేను బయల్దేరే దాన్ని. అదో సరదా అనుభవం. ఆ తర్వాతి సినిమాలు... అశ్విని తర్వాత మరో నాలుగు సినిమాలు చేశాను. అయితే అవన్నీ ఒకే దర్శకుడివి కావడంతో ఇబ్బంది రాలేదు. పైగా నేనెప్పుడూ గ్లామర్ చూపించాల్సిన అవసరం లేకపోయింది. ప్రతీ సినిమాలో ఏదో వేరే ఒక జంట పాటల కోసం ఉండేది. అయితే ఇవి చేశాక ఇక నాకు చాలనిపించింది. ఫైటింగ్స్ కూడా అయిపోయాయి ఇక చేసేదేముంది అనిపించడంతో ఇక సినిమాలు చాలు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. చాలా మంది అడిగినా నిరాకరించాను. భారత అథ్లెటిక్స్‌పై... నిస్సందేహంగా సౌకర్యాల పరంగా చూస్తే మనం ఎవరికీ తక్కువ కాదు. అయితే ఒలింపిక్స్ స్థాయితో పోలిస్తే అథ్లెటిక్స్ ఇంకా చాలా వెనుకబడే ఉంది. మిడిల్ డిస్టెన్స్‌లో మంచి ఫలితాలే వస్తున్నా స్ప్రింట్స్‌లో ఎంతో మెరుగు పడాల్సి ఉంది. గత కామన్వెల్త్ క్రీడలు మన దేశంలో జరగడం ఎంతో మంచి చేసింది. ఆ తర్వాత ప్రతిభాన్వేషణతో పాటు కార్పొరేట్లు కూడా సహకారానికి ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో మనకు ఎక్కువ సంఖ్యలో పతకాలు గెలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పేర్లను ప్రస్తావించలేను కానీ ఓవరాల్‌గా అథ్లెటిక్స్ పరిస్థితి రోజు రోజుకూ మెరుగవుతూనే ఉంది. కాస్త ఓపిక పడితే రాబోయే కొన్నేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే మిషన్ 2020 పేరుతో క్రీడల్లో అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. సరైన కోచ్‌లతో ప్రణాళికలు సమర్థంగా అమలు చేయాల్సి ఉంది. క్రీడల్లో అవినీతిపై... కామన్వెల్త్ వ్యవహారంలో కల్మాడీ పరిస్థితి ఏమైందో చూశారుగా. ఇలా అవినీతిని రూపుమాపాలనే ఆటగాళ్లం అందరం కలసి క్లీన్ స్పోర్ట్స్ సంస్థను స్థాపించాం. క్రీడల్లో అవినీతి బయటపెట్టడంలో మేం కూడా కీలక పాత్ర పోషించామని గర్వంగా చెప్పగలం. వాస్తవంగా చూస్తే ఆటలో ఇంత అవినీతి ఉంటుందా అనేది ఒక అథ్లెట్‌గా ఉన్న సమయంలో తెలీలేదు. కానీ అలాంటివాటిని పరిహరిస్తే భారత్ మరింత వేగంగా దూసుకుపోగలదని అనిపించింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. గత ప్రభుత్వం క్రీడా సంఘాల్లో రాజకీయ నాయకులు ఉండరాదన్న సూచనకు మేం గట్టిగా మద్దతిచ్చాం. ఇకపై కూడా దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించి క్రీడలను క్లీన్‌గా ఉంచుతామని చెప్పగలం. కుటుంబం.... నా భర్త ఆటోమొబైల్ వ్యాపారంలో చాలా ఏళ్లుగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు అనీషా, దీపాలి. ఆరంభంలో ఆటలపై ఆసక్తి చూపిన అనీషా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌లో రాణించింది. అయితే ఆ తర్వాత చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయింది. ఇక చిన్న అమ్మాయికి కూడా పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి నా కుటుంబంనుంచి మరో అథ్లెట్ లేనట్లే.