ఫ్లోరెన్స్ : వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తనను 25 మంది మృగాళ్లు వెంటాడినట్లు, వారి నుంచి ఓ బంగ్లాదేశీయుడు ఆమెను రక్షించినట్లు సోషల్‌మీడియా వేదికగా ఓ మహిళ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఫ్లోరెన్స్ నగరంలోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తనను 25 మంది మృగాళ్లు వెంటాడారని గైయా గ్వార్‌నోటా అనే మహిళ తెలిపింది. తనను చుట్టుముట్టిన వాళ్లు పక్కకు రావాలంటూ ఒత్తిడి చేశారని చెప్పింది.
తాను రానని చెప్పడంతో వారందరూ కోపంతో ఊగిపోయారని, గుంపులో ఇద్దరు తనపై ఉమ్మబోయారని తెలిపింది. మద్యాన్ని తనపై పోశారని, ఆ సన్నివేశాన్ని మొబైల్స్‌లో బంధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పింది. తనను బలవంతం చేస్తుండగా.. ఆ ప్రాంతంలో పూల షాపు నడుపుతున్న బంగ్లా జాతీయుడు కాపాడినట్లు వివరించింది. తనను రక్షించిన అలంగిర్.. తిండి పెట్టి, ఓ పువ్వు ఇచ్చారని పేర్కొంది. అలంగీర్ కనుక రక్షించి ఉండకపోతే తన పరిస్థితిని ఊహించుకోలేకపోతున్నానని వివరించింది. అలంగీర్ ముఖాన్ని తన జీవితంలో మర్చిపోనని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment