ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం! | soldiers died In Army Convoy Attacked By Terrorists | Sakshi
Sakshi News home page

ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం!

Published Sat, Dec 17 2016 5:13 PM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM

ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం! - Sakshi

ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం!

శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాంపోర్ లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా జిల్లాలోని కద్లబాల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్లు ఎదరుకాల్పులు ప్రారంభించగానే కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాల్పులు జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement