Army convoy
-
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
ఢిల్లీ: బలూచిస్తాన్‌లోని తుర్బట్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనే సంస్థ, బలోచ్ రిపబ్లికన్ గార్డ్ ప్రకటించుకున్నాయి. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్, పాకిస్తాన్లలో జరిగిన ఈ ఘటనలతో ఉపఖండంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల కాల్పులు
-
ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాంపోర్ లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా జిల్లాలోని కద్లబాల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్లు ఎదరుకాల్పులు ప్రారంభించగానే కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పులు జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కశ్మీర్లో ‘ఉగ్ర’దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై బిజ్బెహరా సమీపంలో వాహన శ్రేణి లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.హెడ్ కానిస్టేబుల్ గిరీశ్‌కుమార్ శుక్లా, కానిస్టేబుల్ మహీందర్ రామ్, హవల్దార్ దినేశ్ మృతిచెందారు. ఆ ప్రాంతంలో ప్రజలు వుండడంతో జవాన్లు సంయమనం పాటించి కాల్పులు జరపలేద ని అధికారులు చెప్పారు. సెలవులు ముగించుకున్న జవాన్లు 23 వాహనాల్లో తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పనేనని అనుమానిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఆదేశంపై బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ కెకె వర్మ సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. -
'మణిపూర్ దాడి మా పనే'
ఇంఫాల్: ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను హతమార్చింది తామేనని ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఘటనకు బాధ్యవవహిస్టున్నట్లుగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నాగాలాండ్ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ తో గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై గురువారం ఈ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరగా.. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే మిలిటెంట్లు ఆ వాహన శ్రేణిని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. గడిచిన ముప్పై ఏళ్లలో భారత సైన్యం పై జరిగిన భారీ దాడి ఇదే. దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట ను ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కాల్పుల ఘటనను దర్యాప్తుచేస్తోంది.