శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై బిజ్‌బెహరా సమీపంలో వాహన శ్రేణి లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.హెడ్ కానిస్టేబుల్ గిరీశ్‌కుమార్ శుక్లా, కానిస్టేబుల్ మహీందర్ రామ్, హవల్దార్ దినేశ్ మృతిచెందారు.
ఆ ప్రాంతంలో ప్రజలు వుండడంతో జవాన్లు సంయమనం పాటించి కాల్పులు జరపలేద ని అధికారులు చెప్పారు. సెలవులు ముగించుకున్న జవాన్లు 23 వాహనాల్లో తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పనేనని అనుమానిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఆదేశంపై బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ కెకె వర్మ సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
కశ్మీర్‌లో ‘ఉగ్ర’దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
Published Sat, Jun 4 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement