union home minister rajnath
-
కశ్మీర్లో ‘ఉగ్ర’దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై బిజ్బెహరా సమీపంలో వాహన శ్రేణి లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.హెడ్ కానిస్టేబుల్ గిరీశ్‌కుమార్ శుక్లా, కానిస్టేబుల్ మహీందర్ రామ్, హవల్దార్ దినేశ్ మృతిచెందారు. ఆ ప్రాంతంలో ప్రజలు వుండడంతో జవాన్లు సంయమనం పాటించి కాల్పులు జరపలేద ని అధికారులు చెప్పారు. సెలవులు ముగించుకున్న జవాన్లు 23 వాహనాల్లో తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పనేనని అనుమానిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఆదేశంపై బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ కెకె వర్మ సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. -
చర్చలుండాలంటే చర్యలు తప్పవు
ఉగ్ర కేంద్రాలపై పాక్ చర్యలు తీసుకోవాలి ♦ దీని ద్వారానే పొరుగుదేశం చిత్తశుద్ధి తెలుస్తుంది ♦ ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’పై అప్రమత్తత అవసరం ♦ ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ జైపూర్: భారత్‌లో ఉగ్ర కార్యక్రమాలకు పాక్ గడ్డపైనే వ్యూహాలు రూపొందుతున్నాయనే దానికి స్పష్టమైన ఆధారాలున్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈ ఉగ్ర కేంద్రాలపై పాక్ తీసుకునే చర్యలపైనే ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందన్నారు. అటు దక్షిణాసియా ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు కూడా పాక్ నిర్ణయమే కీలకంగా మారిందన్నారు. రాజస్తాన్ ప్రభుత్వం, ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతమొందించటంలో పాక్ చిత్తశుద్ధిని చాటుకోవాలన్న రాజ్‌నాథ్.. దేశాల మధ్య చర్చల్లో టైజం ఓ అంశంగా ఉన్నన్ని రోజులు.. ఉగ్రవాదాన్ని ఎదిరించటం ఓ సవాల్‌గా మారుతుందన్నారు. యువతకు తుపాకులు ఇచ్చి పక్క దేశంలో విధ్వంసం సృష్టించమని చెప్పినన్ని రోజులు స్వయంగా తను ఎదుర్కొంటున్న ఉగ్ర సమస్యకు పాక్ పరిష్కారం వెతుక్కోలేదన్నారు. ప్రపంచంలో మంచి టైస్టులుండరనే విషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని సూచించారు. అల్‌కాయిదా, దాయిష్ సంస్థలు ఇంటర్నెట్ ద్వారా యువతను ప్రభావితం చేసి ఆన్లైన్లో బాంబుల తయారీపై శిక్షణనిచ్చి ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’ నినాదంతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారన్నారు. ఏ ఉగ్ర సంస్థతో సంబంధం లేకుండానే వ్యక్తిగతంగానే కొన్ని గుంటనక్కలు దాడులకు పాల్పడే వీలుందన్నారు. ఇలాంటి వాటిపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్లీ మళ్లీ అదే తప్పు: జై శంకర్ కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ చాలా తప్పుచేస్తున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ అన్నారు. బయట దేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు.. తమ దేశంలో నెలకొన్న అశాంతిని గుర్తించటం లేదని పాక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద బాధితులమని పైకి చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరాటానికి కొన్ని దేశాలు సహకారం అందించడంలేదన్నారు. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో ఉగ్రవాద దాడికి మూలాలు కనుక్కోవడం పెద్ద సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదానికి సంబంధించి ఏ సమాజంలోనైనా ఎవరి ప్రయేయం ఉందో కనుక్కోవడం కూడా కష్టం కాబోదన్నారు. పఠాన్‌కోట్ ఘటన తర్వాత తన స్థాయిలోనూ, జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలోనూ.. పాక్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని జై శంకర్ తెలిపారు. తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి విచారణలో పురోగతి కనిపిస్తోందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఉగ్రవాద కట్టడికి మొత్తం ప్రపంచాన్ని ఉత్తేజం చేయడం భారత దౌత్యపరమైన లక్ష్యాల్లో ఒకటని జై శంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా రసాయన ఆయుధాలను నిషేధిస్తూ అంతర్జాతీయ ఒప్పందాల్లాంటివి చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉగ్రవాదం నియంత్రణకు మయన్మార్‌తో చర్చలు జరిగాయని వారు కూడా సానుకూలంగా స్పం దించారని తెలిపారు. బంగ్లాదేశ్ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. -
పోలీసు అధికారులను బాధ్యులను చేయండి
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల విషయంలో పోలీసులను మరింత బాధ్యులను చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రాన్ని కోరింది. ఆ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ బృందానికి ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు ధరంవీర్గాంధీ, ఎంపీ సాధుసింగ్లు, సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాతీయ రాజధాని నగరంలో మహిళల భద్రత అంశాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకుపోయారు. అనంతరం వారు పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రేడియో క్యాబ్ డ్రైవర్ల లెసైన్సులను తనిఖీ చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ ఘటన నేపథ్యంలో మహిళల భద్రత కోసం పీసీఆర్ వ్యాన్లను మోహరించాలని కోరారు. ‘ అనేక లోపాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని, కిందిస్థాయి అధికారులతోపాటు ఉన్నతాధికారులను ఇందుకు బాధ్యులుగా చేయాలి. వారిపై ఎటువంటి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్ అధికారినో లేక ఐపీఎస్ అధికారినో కచ్చితంగా బాధ్యులను చేయాలి. ఉన్నతాధికారులు మారనంతవరకూ పరిస్థితులు ఎంతమాత్రం మెరుగుపడవు. రాత్రివేళల్లో నిర్వహించే పెట్రోలింగ్‌లో పాలుపంచుకోవాలంటూ ఉన్నతాధికారులను కచ్చితంగా ఆదేశించాలి. ఇలా చేయడం వల్ల దిగువస్థాయి సిబ్బంది కూడా అప్రమత్తమవుతారు. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటే ఇంచార్జి అధికారిని బాధ్యులను చేయాలి’ అని కోరామని సిసోడియా మీడియాకు తెలియజేశారు. మహిళల భద్రత కోసం వినియోగించాలి ఎంపీలతోపాటు ల్యుటెన్స్జోన్లో నివసించే వారి భద్రత కోసం కాకుండా మహిళల భద్రత కోసం పీసీఆర్ వ్యాన్లను వినియోగించాలని కేంద్రాన్ని కోరినట్టు మనీష్ సిసోడియా తెలియజేశారు. -
పాక్ అండతోనే దేశంలో ఉగ్రవాదం
రాజ్‌నాథ్ మండిపాటు అఫ్ఘాన్-పాక్ సరిహద్దులో దావూద్‌కు ఆశ్రయం న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆశ్రయం కల్పించారని వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దాయాది దేశం పాక్‌కు స్నేహ హస్తం అందించడానికి ప్రయత్నిస్తున్నా.. దానిని అందుకోవడానికి ఆ దేశం మాత్రం సుముఖంగా లేదన్నారు. భారత్‌లో ఉగ్రవాదం అంతా పాక్ ప్రేరేపితమేనన్నారు. ప్రభుత్వ సంస్థలేవీ ఉగ్రవాదానికి సహకరించడంలేదని పాక్ చెబుతోందని, అయితే ఐఎస్ఐ ఆదేశ ప్రభుత్వ సంస్థ కాదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు. 2008 ముంబై అల్లర్ల కేసులో నిందితులను శిక్షించడానికి పాక్ చర్యలు తీసుకోవడంలేదని, దర్యాప్తును చాలా నెమ్మదిగా కొనసాగిస్తోందని ఆరోపించారు. దావూద్‌ను అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా పాక్ పెడచెవిన పెడుతోందన్నారు. ఈ విషయంలో ప్రధాని కూడా ప్రయత్నం చేశారన్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతున్నామని చెప్పారు. దావూద్ పాక్, అఫ్ఘాన్ బోర్డర్లో ఉన్నాడని చెప్పారు. భారత్‌తో మాట్లాడే ముందు కాశ్మీరీ వేర్పాటువాదులతో మాట్లాడతానని పాక్ ప్రధాని స్పష్టం చేశారు కదా అని ప్రశ్నించగా.. పాక్ నిర్ణయం స్పష్టంగా ఉంటే, తమ నిర్ణయమూ స్పష్టంగా ఉందన్నారు. అంతర్గత భద్రతపై తమ ప్రభుత్వం వెనకడుగువేసేది లేదన్నారు. ప్రధాని అందరు మంత్రులకు స్వేచ్ఛనిచ్చారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను, ప్రధాని కూడా ఆర్ఎస్ఎస్ పరివారమేనని, అదేమీ బాహ్యశక్తి కాదని అన్నారు.