న్యూఢిల్లీ: అత్యాచార కేసుల విషయంలో పోలీసులను మరింత బాధ్యులను చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రాన్ని కోరింది. ఆ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ బృందానికి ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు ధరంవీర్‌గాంధీ, ఎంపీ సాధుసింగ్‌లు, సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాతీయ రాజధాని నగరంలో మహిళల భద్రత అంశాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకుపోయారు. అనంతరం వారు పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రేడియో క్యాబ్ డ్రైవర్ల లెసైన్సులను తనిఖీ చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ ఘటన నేపథ్యంలో మహిళల భద్రత కోసం పీసీఆర్ వ్యాన్లను మోహరించాలని కోరారు.
‘ అనేక లోపాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని, కిందిస్థాయి అధికారులతోపాటు ఉన్నతాధికారులను ఇందుకు బాధ్యులుగా చేయాలి. వారిపై ఎటువంటి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్ అధికారినో లేక ఐపీఎస్ అధికారినో కచ్చితంగా బాధ్యులను చేయాలి. ఉన్నతాధికారులు మారనంతవరకూ పరిస్థితులు ఎంతమాత్రం మెరుగుపడవు. రాత్రివేళల్లో నిర్వహించే పెట్రోలింగ్‌లో పాలుపంచుకోవాలంటూ ఉన్నతాధికారులను కచ్చితంగా ఆదేశించాలి. ఇలా చేయడం వల్ల దిగువస్థాయి సిబ్బంది కూడా అప్రమత్తమవుతారు. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంటే ఇంచార్జి అధికారిని బాధ్యులను చేయాలి’ అని కోరామని సిసోడియా మీడియాకు తెలియజేశారు.
మహిళల భద్రత కోసం వినియోగించాలి
ఎంపీలతోపాటు ల్యుటెన్స్‌జోన్‌లో నివసించే వారి భద్రత కోసం కాకుండా మహిళల భద్రత కోసం పీసీఆర్ వ్యాన్లను వినియోగించాలని కేంద్రాన్ని కోరినట్టు మనీష్ సిసోడియా తెలియజేశారు.
పోలీసు అధికారులను బాధ్యులను చేయండి
Published Thu, Dec 11 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement