శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లార్కిపోరా ప్రాంతంలోని లుక్బావన్ గ్రామ సర్పంచ్ అజయ్ పండిత(40) అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. ఆయన ఉగ్రవాదుల చేతిలో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అజయ్ పండిత కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్. అజయ్ పండిత అంత్యక్రియల అనంతరం ఆయన సోదరుడు విజయ్ పండిత మీడియాతో మాట్లాడుతూ.. మేము కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లము. కశ్మీర్ లోయలో పండిట్ల కోసం ప్రభుత్వం వెంటనే రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తన సోదరుడు అందరికీ సహాయం చేసేవాడని తెలిపారు. బలహీన వర్గాల వారిని ఆదుకునేవాడని పేర్కొన్నారు. అజయ్ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ముస్లిం గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు. (కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు)
అదే విధంగా మృతి చెందిన సర్పంచ్ అజయ్ పండిత తండ్రి ద్వారికా నాథ్ పండిత మాట్లాడుతూ.. తన కుమారుడు నిజమైన దేశభక్తుడని తెలిపాడు. 1996లో తమ కుటుంబం తిరిగి కశ్మీర్‌కు వచ్చిందన్నారు. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని అజయ్ తమ ఇంటిని నిర్మించాడని పేర్కొన్నారు. తన కుమారుడి మృతి వెనక దేశ ద్రోహులు ఉన్నారని ఆరోపించారు. అజయ్ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని తెలిపారు. గత డిసెంబర్‌లో అజయ్.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరిన విషయాన్ని తండ్రి ద్వారికా నాథ్ గుర్తుచేశారు. (సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్)
Comments
Please login to add a commentAdd a comment