సొరంగ మార్గంలో ఉగ‍్రవాదులు చొరబడ్డారు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని బీఎస్‌ఎఫ్ డీజీ కేకే శర్మ చెప్పారు. సైనిక స్థావరాలపై దాడి చేసిన ఉగ్రవాదులు సొరంగ మార్గం ద్వారా జమ్ము కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి చొరబడ్డారని తెలిపారు. ఫెన్సింగ్ లేని ప్రాంతాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు.
సర్జికల్ దాడుల తర్వాత ఇప్పటి వరకు 15 మంది పాకిస్థాన్ రేంజర్లను, 10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని బీఎస్‌ఎఫ్ డీజీ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో భద్రత దళాలకు ఇబ్బందేమీ లేదని చెప్పారు. నగరోటాలో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో ఏడుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. భద్రత దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను బీఎస్‌ఎఫ్ డీజీ సమీక్షించారు.