న్యూఢిల్లీ : భారత్ - పాక్ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయమని చెప్పలేదని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కె కె శర్మ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో శర్మ మాట్లాడుతూ... వాళ్తంతట వాళ్లే వెళ్లిపోయారని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరగలేదన్నారు. పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఉద్రిక్తత ఉన్న మాట వాస్తవమే అని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్లో 4 వేల పైచిలుకు సరిహద్దు ఉందని... అందులో 1000 కి.మీ నదీ ప్రాంతమే ఉందని శర్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడ ఫెన్సింగ్ వేయడం సాధ్యం కాని పని అని చెప్పారు. ఫెన్సింగ్ లేని ప్రాంతాల నుంచే స్మగ్లింగ్ జరుగుతోందన్నారు. స్మగ్లింగ్పై బీఎస్ఎఫ్, బీజీబీ చర్యలు తీసుకుంటుందని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శర్మ వివరించారు.