indo pak border
-
‘మిఠాయి దౌత్యం’.. స్వీట్లు పంచుకున్న భారత్, పాక్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇరు దేశాల భద్రతా సిబ్బంది కలిసిపోతారు. ప్రత్యేక దినాల్లో ఇరు సైనికులు స్నేహాభావంతో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. తాజాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందంలో మునిగారు. పూంచ్- రావల్కోట్ సరిహద్దు వద్ద ఉన్న భారత్ పాక్ సైనికులు ‘మిఠాయి దౌత్యం’ నిర్వహించారు. ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఇరు దేశాలు సైనికులు మిఠాయి దౌత్యం చేపట్టారు. ఇక పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని మిఠాయి దౌత్యం నిర్వహించామని పూంచ్‌లోని భారత లెఫ్టినెంట్ కమాండర్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మిఠాయిలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రెసిడెంట్లు మార్చుకున్నట్లు వివరించారు. ఇలాంటి వాటితో రెండు దేశాల మధ్య స్నేహం, విశ్వాసాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి మిఠాయి దౌత్యం నిర్వహించారు. పూంచ్ జిల్లాలోని సరిహద్దులో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాల సైనికులు (ఫొటో: హిందూస్తాన్ టైమ్స్) -
ఇండో–పాక్ బోర్డర్లో నగరవాసి హల్చల్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన పరమేశ్వర్ అనే వ్యక్తి రాజస్తాన్‌లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) జవాన్లకు చెమటలు పట్టించాడు. ఈ నెల 17న అక్కడి ఇండియా–పాకిస్తాన్ బోర్డర్లో హల్చల్ చేశాడు. ఫెన్సింగ్ దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిడానికి ప్రయత్నించాడు. పరమేశ్వర్ ఆహార్యాన్ని చూసిన బీఎస్ఎఫ్ జవాన్లు ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వివిధ విభాగాలు ఉమ్మడిగా చేసిన ఇంటరాగేషన్‌లో ఆ కోణం బయటపడకపోవడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. గురువారం అక్కడకు చేరుకున్న సోదరుడు, బావమదిరి తదితరులకు రాజస్తాన్ పోలీసులు పరమేశ్వర్‌ను అప్పగించారు. వరంగల్‌లోని ఖానాపూర్‌కు చెందిన వెంకట నర్సింహ్మ కుమారుడు ఎన్.పరమేశ్వర్ వయస్సు ప్రస్తుతం 46 ఏళ్లు. భార్యకుమారులు కలిగిన ఇతగాడు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి డైమండ్ పాయింట్ సమీపంలో నివసిస్తున్నాడు. అయితే కుటుంబ కారణాలతో పాటు ఐదేళ్ల క్రితం తన తల్లి కూడా చనిపోవడంతో పరమేశ్వర్‌కు మతిస్థిమితం తప్పింది. అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించే అతగాడు ఓ దశలో తన భార్య, పిల్లల పైనే దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన డైమండ్ పాయింట్ ప్రాంతానికి చెందిన స్థానికులు పరమేశ్వర్‌ను మందలించారు. దీంతో అప్పటి నుంచి ఇంటిని, కుటుంబాన్నీ ఇతగాడు వదిలేశాడు. కొన్నాళ్లు వేర్వేరు ప్రాంతాల్లోని తన బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి కనిపించిన రైలు ఎక్కడం, అది ఎక్కడకు వెళితే అక్కడ దిగి ఆ ప్రాంతంలో ఉన్న పరిచయస్తులు, బంధువుల ఇళ్లకు వెళ్తుండేవాడు. ఆపై ఇతడి ఆచూకీ కుటుంబీకులకు కూడా తెలియలేదు. హఠాత్తుగా గురువారం పరమేశ్వర్ రాజస్తాన్‌లో పరిచయం అయ్యాడు. అక్కడి జైసల్మీర్ ప్రాంతంలోని పోచ్ఛా ప్రాంతంలో ఉన్న ఇండో–పాక్ బోర్డర్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఫెన్సింగ్ దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఆ ఫెన్సింగ్‌కు ఉన్న ఖాళీ సీసాలు శబ్ధం చేయడంతో అక్కడి పహారా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ 56వ బెటాలియన్ జవాన్లు గుర్తించారు. గడ్డంతో పాటు పరమేశ్వర్ ఆహార్యం చూసిన జవాన్లు ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో జిన్‌జిన్యాలీ పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో ఆ ఠాణాకు తరలించారు. పరమేశ్వర్‌ను రాజస్తాన్ పోలీసులు, బీఎస్ఎఫ్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని, తన స్వస్థలం ఖానాపూర్ అని వారితో చెప్పిన పరమేశ్వర్ తన తండ్రి, సోదరుల వివరాలు వెల్లడించాడు. దీంతో జిన్‌జిన్యాలీ అధికారులు ఖానాపూర్ పోలీసుల ద్వారా పరమేశ్వర్ సోదరుడు పుల్లయ్యకు సమాచారం ఇచ్చారు. ఇతడితో పాటు పరమేశ్వర్ బావ అనిల్ తదితరులు గురువారం జిన్‌జిన్యాలీ ప్రాంతానికి చేరుకున్నారు. పరమేశ్వర్ తమ సంబంధీకుడే అని నిరూపించడానికి అవసరమైన పత్రాలు సమర్పించాడు. అప్పటికే ఐబీ, రా సహా వివిధ ఏజెన్సీలో కూడిన బృందాల ఉమ్మడి ఇంటరాగేషన్లోనూ పరమేశ్వర్‌కు సంబంధించి ఎలాంటి అనుమానిత అంశాలు వెలుగులోకి రాలేదు. దీంతో అతడిని రాజస్తాన్ పోలీసు లు కుటుంబీకులకు అప్పగించారు. పరమేశ్వర్ సోదరు డు పుల్లయ్య శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘దాదాపు ఐదేళ్ల తర్వాత మా సోదరుడిని తొలిసారి చూస్తున్నా. మతిస్థిమితం లేని ఇతడు మా చిరునామా, ఇతర వివరాలు రాజస్తాన్ పోలీసులకు ఎలా చెప్పాడో అర్థం కావట్లేదు. గురువారం మమ్మల్ని చూసిన వెంటనే గుర్తుపట్టాడు. అయితే ఆ తర్వాత మా త్రం సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నాడు. గురువారం రాజస్థాన్ నుంచి పరమేశ్వర్‌తో కలిసి కారు లో బయలుదేరి గుజరాత్ వరకు చేరుకున్నాం. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అతడి భార్యకు అప్పగించడంతో పాటు వైద్యం చేయిస్తాం’ అని పేర్కొన్నారు. -
బోర్డర్ పరిస్థితిపై హోంశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించారు. పాకిస్తాన్ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకురాగా, భారత దళాలు నౌషెరాలో పాక్ ఎఫ్ 16 జెట్‌ను కూల్చివేశాయి. భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. భారత్ ప్రతిఘటనతో పాక్ యుద్ధవిమానాలు వెనుతిరిగాయి. మరోవైపు పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్‌లోని పలు ఎయిర్‌బేస్‌ల నుంచి భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు చెప్పారు. -
సరిహద్దుల్లో కానరాని ఈద్ సందడి
సాక్షి, శ్రీనగర్ : ఈద్ సందర్భంగా భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏటా కనిపించే దృశ్యాలకు భిన్నంగా ఈసారి గంభీర వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అట్టారి-వాగా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు పరస్పరం స్వీట్లు పంచుకోలేదు. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈద్ సందర్భంగా ఇరు దేశాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్వీట్లు పంచుకోవడానికి దూరంగా ఉన్నారు. రాజౌరిలోని నౌషెరా బ్లాక్‌లో శనివారం సైతం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ భారత జవాన్ మరణించారు. ఇక ఈద్, దీపావళి వంటి పర్వదినాల్లో, స్వాతంత్ర్యదినం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఇరు దేశాల జవాన్లు స్వీట్లు పంచుకుని సందడి చేసేవారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజునా పాకిస్తాన్ రేంజర్లతో స్వీట్లు పంచుకునే సంప్రదాయానికి బీఎస్ఎఫ్ స్వస్తిపలకడం గమనార్హం. అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ యదేచ్ఛగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటానికి నిరసనగా బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఇండో పాక్ బోర్డర్ మధ్యలో కోబ్రా తీగలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా పహారా కాసే సైనికులకు తోడ్పాటుగా భారత్ పాక్ సరిహద్దులోని హిందూమల్కోట్ ప్రాంతంలో గల బీఎస్ఎఫ్ పోస్టులో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ శాఖ ప్రవేశపెట్టింది. రాజస్థాన్‌లో ఉన్న హిందూమల్కోట్ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతం. శత్రువులు దేశంలోకి చొరబడకుండా బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ కాస్తుంటారు. డాగ్ స్వ్కాడ్ కూడా గస్తీలో పాల్గొంటుంది. తాజాగా ఈ ప్రాంతంలో హ్యాండ్ హ్యాండిల్ థర్మల్ ఇమేజర్(హెచ్‌హెచ్‌టీఈ)ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రసారమయ్యే పరారుణ కిరణాలు శత్రువుల రాకను మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలవు. సూర్యాస్తమయ సమయం అనంతరం హెచ్‌హెచ్‌టీఈ భద్రతకు దన్నుగా నిలుస్తుంది. దీంతో పాటు సరిహద్దు వెంబడి కోబ్రా తీగలను అమర్చి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ కోబ్రా తీగ హై ఓల్టేజ్ కరెంటు కలిగి ఉంటుంది. దీన్ని సరిహద్దు ఫెన్సింగ్ మధ్యలో అమర్చారు. ఈ తీగలు పాకిస్తాన్ నుంచి చొరబాట్లను అరికడుతుంది. చొరబాటుదారుడు ఈ తీగను తాకగానే స్పృహ కోల్పొతాడు. హెచ్‌హెచ్‌టీఈ ద్వారా జీవుల కదిలికలను కచ్చితంగా గుర్తించగల్గుతారు. గస్తీలో పాల్గొనే డాగ్స్వ్కాడ్లోని కుక్కలకు రాత్రిపూట పహారా కసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2017 ఆగస్టులోనే బీఎస్ఎఫ్ చీఫ్ శర్మ ఇండో పాక్ సరిహద్దులో సాంకేతిక పరిజ్ఞాన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ హై టెక్ పరిజ్ఞానాన్ని జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రవేశ పెట్టనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. -
చైనా దొంగబుద్ధి..!?
చైనా, పాకిస్తాన్‌లు భారత్ వెనుక గొయ్యి తీస్తున్నాయా? పాకిస్తాన్-చైనా ఎకనమిక్ కారిడార్ పేరుతో.. సైనిక సహకారం అందించుకుంటున్నాయా? ఇండో-పాక్ సరిహద్దులో బంకర్ల ఏర్పాటుకు చైనా సహకరిస్తోందా? సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ను చైనా అండగా ఉంటోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్ రీజియన్‌లో అజేయ శక్తిగా ఎదుగుతున్నభారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్‌ను చైనా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోందని ఒక అంతర్జాతీయ సర్వే ప్రకటించింది. దిమ్మతిరిగే వాస్తవాలను సర్వే వెలువరించింది. ఈ సర్వే ప్రకారం.. ఇండో-పాక్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా చైనా బంకర్లను ఏర్పాటు చేస్తోంది. అంతేకాక జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్‌కు వరకూ ఉన్న సరిహద్దు వెంబడి పాకిస్తాన్ బంకర్ల నిర్మాణం చేపడుతోందని తెలుస్తోంది. అంతేకాక సరిహద్దుల్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు ఎయిర్‌పోర్టుల నిర్మించగా.. మరో రెండు నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు సర్వేలో వెల్లడయింది. సరిహద్దుల్లోనే! రాజస్థాన్‌లోని జైలస్మీర్కు సరిహధ్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోని ఖైరాపూర్ వద్ద చైనా సహకారంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతంఈ ఎయిర్ బేస్‌లో చైనాకు చెందిన రక్షణ శాఖ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్‌పోర్టుకు రక్షణగా చైనా సైనికులు పహారా కాస్తున్నట్లు సర్వే ప్రకటించింది. అలాగే గుజరాత్ సరిహద్దుకు దగ్గర్లోని మిథి వద్ద పాకిస్తాన్ మరో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇదిలా ఉండగా ఈ ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రతిపాదిత రహదారి వెళుతోంది. భారీగా బంకర్లు చైనా సహకారంతో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పటికే 350 బంకర్లను నిర్మించుకున్నట్లు సర్వే తెలుస్తోంది. అంతేకాక రక్షణ కోసం వినియోగించే సొరంగాలను ఏర్పాటు చేసుకుంది. చైనా పరికరాలు సరిహద్దుల్లో పాకిస్తాన్ నిర్మించిన ఎయిర్‌పోర్టుల్లో చైనాకు చెందిన ఆధునిక రాడార్ వ్యవస్థ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నిఘా వర్గాలేమంటున్నాయి! పాకిస్తాన్-చైనా మధ్య రక్షణ సహకారం పెరుగుతోందని భారత నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీ నిర్మాణాలను చేపడుతున్న విషయం నిజమని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. చైనా చర్యలు ఉపఖండంలో పరిస్థితులను విషమంగా మార్చేలా ఉన్నాయని నిఘావర్గాలు తెలిపాయి. -
పాక్.. మరో దుస్సాహసం
భారతదేశంతో సరిహద్దుల వెంబడి పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు చేస్తోంది. తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ సమీక్షిస్తున్నారు. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్ సమీపంలో సరిహద్దును ఆనుకుని ఈ విన్యాసాలు చేస్తున్నారు. వీటికి పాక్ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ కూడా హాజరయ్యారు. హెలికాప్టర్ గన్‌షిప్‌లు, పదాతి దళాలు కూడా ఇందులో పాల్గొటున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా అవాంఛిత పరిస్థితి వస్తే తమ సైన్యం దాన్ని ఎదుర్కోడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సైనిక విన్యాసాలు సూచిస్తాయని పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు. తమ సహనాన్ని బలహీనతగా భారతదేశం భావించకూడదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. తమపై దాడి జరిగితే కాపాడుకోగల సామర్థ్యం ఉందన్నారు. అయితే.. భారత దాడుల్లో తమ సైనికులు ఏడుగురు చనిపోయారని మాత్రం పాక్ ఇటీవలే అంగీకరించింది. -
మనం కంచె వేసుకుంటే.. చైనాకు నొప్పేంటి?
భారత్ - పాకిస్థాన్ వ్యవహారంలో వేలు పెట్టడాన్ని చైనా ఇంకా మానుకోవడం లేదు. పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులను మనం మూసుకుంటే అది తప్పని ఆ దేశం అంటోంది. దానివల్ల భారత్-చైనా సంబంధాలు మరింత పాడవుతాయని చెప్పింది. భారతదేశం చాలా అహేతుకమైన నిర్ణయం తీసుకుంటోందని, ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత దానిపై ఇంతవరకు దర్యాప్తు కూడా మరీ గట్టిగా ఏమీ జరగలేదని, అలాగే ఆ దాడి వెనుక పాక్ హస్తం ఉందనడానికి సాక్ష్యం కూడా ఏమీ లేదని షాంఘై అకాడమీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కు చెందిన హు జియాంగ్ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న మొత్తం 3.323 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును 2018 డిసెంబర్ నాటికి పూర్తిగా మూసేస్తామంటూ భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిచంఆరు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్యం అంతంతమాత్రంగా ఉందని, ఇప్పుడు సరిహద్దులను మూసేస్తే ఇది మరింత ప్రభావితం అవుతుందని ఆయన చెప్పారు. సరిహద్దులను మూసేయడం వల్ల ఇరుదేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు మరింత విఘాగం కలుగుతుందని షాంఘై మునిసిపల్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సదరన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ వాంగ్ డెహువా వ్యాఖ్యానించారు. భారత నిర్ణయాన్ని బట్టి చూస్తే ఇప్పటికే పరోక్ష యుద్ధం ఉందన్న జాడలు కనిపిస్తున్నాయని, సరిహద్దు మూత వల్ల కశ్మీర్ వాసులలో మరింత విద్వేషభావాలు చెలరేగుతాయని అన్నారు. చైనాకు పాకిస్థాన్ ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి, భారత దేశం తీసుకుంటున్న నిర్ణయం వల్ల భారత్ - చైనా - పాక్ సంబంధాలు మరింత సంక్లిష్టం అవుతాయని హు జియాంగ్ తెలిపారు. కశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుక్కుంటే అది చైనాకు కూడా మంచిది అవుతుందన్నారు. త్వరలో గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రధాన నరేంద్రమోదీతో పాటు కలిసి పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వస్తున్న నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు రావడం గమనార్హం. -
'ఆ ప్రాంతాల నుంచే స్మగ్లింగ్ జరుగుతోంది'
న్యూఢిల్లీ : భారత్ - పాక్ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలను ఖాళీ చేయమని చెప్పలేదని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కె కె శర్మ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో శర్మ మాట్లాడుతూ... వాళ్తంతట వాళ్లే వెళ్లిపోయారని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరగలేదన్నారు. పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఉద్రిక్తత ఉన్న మాట వాస్తవమే అని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లో 4 వేల పైచిలుకు సరిహద్దు ఉందని... అందులో 1000 కి.మీ నదీ ప్రాంతమే ఉందని శర్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడ ఫెన్సింగ్ వేయడం సాధ్యం కాని పని అని చెప్పారు. ఫెన్సింగ్ లేని ప్రాంతాల నుంచే స్మగ్లింగ్ జరుగుతోందన్నారు. స్మగ్లింగ్‌పై బీఎస్ఎఫ్, బీజీబీ చర్యలు తీసుకుంటుందని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శర్మ వివరించారు.