civilians
-
దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు. అలాగే ఖైర్సన్లోని క్లినిక్‌లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్‌ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు. -
Russia-Ukraine war: శరణమో, మరణమో
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్ థర్మల్ పవర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. 40,000 మంది రష్యా జవాన్లు బలి! జూన్ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. డోన్బాస్లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు. యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్ అంచనా వేశారు. 20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. -
జనంపై బాంబుల మోత
కీవ్/వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం పాశవిక దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిపై క్షిపణుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ శివార్లలోని కాలీనివ్కా, బ్రోవరీ పట్టణాలపై గురువారం క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది. కీవ్‌లో 16 అంతస్తుల ఓ అపార్ట్ మెంట్ భవనంపై రష్యా సైన్యం రాకెట్ దాడులు జరిపింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి 30 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేశారు. ఖర్కీవ్ సమీపంలో ఉన్న మెరెఫా పట్టణంలో ఓ పాఠశాల, కమ్యూనిటీ కేంద్రంపై రష్యా దాడికి దిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చెర్నీహివ్లోని ఓ హోటల్‌పై రష్యా బాంబులు ప్రయోగించడంతో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మారియుపోల్ సిటీలో మహిళలు, చిన్నారులు ఆశ్రయం పొందుతున్న నెప్ట్యూన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌పైనా రష్యా సైన్యం విరుచుకుపడింది. గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. పోర్ట్ సిటీ మారియుపోల్‌లో దాదాపు 1,000 మంది తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మూడంతస్తుల ఈ థియేటర్ చాలావరకు ధ్వంసమయ్యింది. ముఖద్వారం పూర్తిగా కుప్పకూలింది. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కొందరు గురువారం క్షేమంగా బయటపడినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు, డొనెట్స్క్ మాజీ గవర్నర్ సెర్గీ టరూటా చెప్పారు. అయితే, థియేటర్‌పై దాడి అంటూ వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. థియేటర్‌పై తాము దాడి చేయలేదని వెల్లడించింది. మారియుపోల్‌లో ఎక్కడా దాడులు జరపలేదని పేర్కొంది. తిరిగి వస్తున్న శరణార్థులు! ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు శరణార్థుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వలసబాట పట్టారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్ల రాక కోసం పడిగాపులు గాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడ ఉండలేక తిరిగి వస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లిథువేనియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఎస్తోనియా, స్లొవేనియా కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించాయి. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి: జెలెన్స్కీ రష్యా దండయాత్ర నుంచి మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాల సాయం అర్థిస్తున్నారు. బుధవారం అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన గురువారం జర్మనీ చట్టసభ సభ్యులకు మొరపెట్టుకున్నారు. జర్మనీ ఫెడరల్ పార్లమెంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయం అందించాలని కోరారు. రష్యా రాక్షసకాండ సాగిస్తోందని, వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని, ఇప్పటివరకు 108 మంది చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించకుండా జర్మనీ ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలన్నారు. మెలిటోపోల్ మేయర్ విడుదల తమ సైన్యం వారం రోజుల క్రితం అపహరించిన ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా విడుదల చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తమ నిర్బంధంలో ఉన్న 9 మంది రష్యా సైనికులకు స్వేచ్ఛ కల్పించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి డారియా జరీవ్నా ధ్రువీకరించారు. ‘నాటో’లో ఉక్రెయిన్ భాగమే: కమల ట్వీట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్ కూడా సభ్య దేశమేనంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చేసిన రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. నాటో కూటమిని రక్షించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తొలగించారు. గంట తర్వాత మరో ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, నాటో సభ్యదేశాలను రక్షించుకుంటామని రెండో ట్వీట్లో పేర్కొన్నారు. నేడు బైడెన్, జిన్‌పింగ్ చర్చలు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు, తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించనున్నారని శ్వేతసౌధం తెలియజేసింది. అమెరికా–చైనా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా వారు చర్చిస్తారని పేర్కొంది. రష్యాకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని అమెరికా, నాటో దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి. -
సోపోర్‌లో ఉగ్రవాదుల మెరుపు దాడి
జమ్మూకశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై గ్రనేడ్‌తో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఎల్ఈటీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండిస్తూ ట్విట్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. చదవండి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం థర్డ్‌వేవ్ ముప్పు నిజమే.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: కేజ్రీవాల్ -
బుర్కినా ఫాసోలో 100 మంది కాల్చివేత
నియామీ: బుర్కినో ఫాసోలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు కనీసం 100 మందిని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సోల్హాన్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని సాహెల్స్ యఘ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి ఒస్సేనీ తంబౌరా చెప్పారు. ఈ ఘటనకు జిహాదీలే కారణమని తెలిపారు. స్థానిక మార్కెట్‌ను, పలు ఇళ్లకు వారు నిప్పంటించారని పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత అమానవీయమైనదని దేశాధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లలో ఇంత భారీస్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి. సాహెల్‌లో 5,000 ఫ్రెంచ్ సైనికులు మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రాంతంలో ఇటీవల జిహాదీల దాడులు పెరుగుతూ వస్తున్నాయి. -
చైనా వాల్ యుద్ధం కోసం కాదట..!
జెరూసలేం: ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చైనా వాల్ గురించి ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్ట్‌లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చైనా వాల్ ఉత్తర భాగాన్ని ఆక్రమణలను నిరోధించడానికి కాదని.. పౌరులను పర్యవేక్షించే నిమిత్తం నిర్మించినట్లు వారు తెలిపారు. పరిశోధకులు మొదటిసారి 740 కిలోమీటర్ల పొడవైన చైనా వాల్ ఉత్తరభాగాన్ని పూర్తిగా మ్యాప్ చేశారు. వారి పరిశోధనలో తెలిసిన అంశాలు మునుపటి పరిశీలనలను సవాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండేళ్లుగా ఈ పరిశోధనలకు అధ్యక్షత వహించిన జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన గిడియాన్ షెలాచ్ లావి మాట్లాడుతూ.. ‘మా పరిశోధనకు ముందు, చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని ఆపడం కోసమే ఉత్తర భాగంలో గోడ నిర్మాణాన్ని చేపట్టినట్లు చాలా మంది భావించారు. కానీ ఈ భాగం లోతు తక్కువగా ఉన్న మంగోలియాలోని రహదారులకు సమీపంగా ఉంది. మా పరిశోధనలు తేల్చిన అంశం ఏంటంటే.. ఈ ఉత్తర భాగాన్ని సైనికేతర పనుల కోసం అనగా ప్రజలు, పశువుల కదలికలను పర్యవేక్షించడం, నిరోధించడం.. వాటికి పన్ను విధించడం వంటి కార్యక్రమాల కోసం నిర్మించారు’ అని తెలిపారు. షెలాచ్-లావి, అతని ఇజ్రాయెల్, మంగోలియన్, అమెరికన్ పరిశోధకుల బృందం గోడలను మ్యాప్ చేయడానికి డ్రోన్లు, అధిక-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు, సాంప్రదాయ పురావస్తు సాధనాలను ఉపయోగించింది. వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం మొదట క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ప్రారంభమై.. శతాబ్దాలుగా కొనసాగింది. పురాణ మంగోలియన్ విజేతకు చిహ్నంగా ‘చెంఘిజ్ ఖాన్ వాల్’ అని పిలవబడే ఉత్తర భాగం 11, 13 వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఇది 72 చిన్న చిన్న నిర్మాణాలతో నిండి ఉంది. -
జాగ్రత్త పడకపోతే.. వినాశనమే
టెహ్రాన్/వాషింగ్టన్: ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయే ప్రమాదముందని ఇరాన్ హెచ్చరించింది. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, ఆరోగ్య సూచనలను విధిగా పాటించాలని, లేదంటే, కనీవినీ ఎరగని ప్రాణ నష్టం జరిగే ప్రమాదముందని దేశ పౌరులకు సూచించింది. మధ్య ప్రాచ్యంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90% ఇరాన్‌లోనే నమోదవుతున్నాయి. ఇరాన్లో 988 మంది చనిపోగా, 16 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలపై టెహ్రాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేపట్టిన అధ్యయన వివరాలను ఇరాన్ అధికార టీవీ జర్నలిస్ట్ డాక్టర్ అఫ్రుజ్ ఎస్లామి మంగళవారం వెల్లడించారు. ఆ అధ్యయనం మూడు పరిస్థితులను అంచనా వేసింది. అవి.. ►1. దేశ పౌరులు పూర్తిగా సహకరిస్తే.. ఈ వైరస్ బారిన 1.2 లక్షల మంది పడతారు. 12 వేల మంది చనిపోతారు. ►2. పౌరులు సాధారణ స్థాయిలో సహకరిస్తే.. 3 లక్షల కేసులు నమోదవుతాయి. 1.1 లక్షల మంది చనిపోతారు. ►3. ఒకవేళ, పౌరులు సహకరించకుండా, జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే 40 లక్షల మందికి ఈ వైరస్ సోకుతుంది. 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు’. ఇరాన్లో 250 మంది భారతీయులకు వైరస్ సోకిందన్న వార్తను నిర్ధారించలేమని భారత్ తెలిపింది. ఆగస్ట్ వరకు ఈ సంక్షోభం కరోనా వైరస్ సంక్షోభం ఆగస్ట్ వరకు కొనసాగే ప్రమాదముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో సోమవారం సాయంత్రానికి కరోనా కారణంగా 85 మంది చనిపోగా, 4500 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాల్లో దాదాపు 60 లక్షల మంది ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 1.82 లక్షల కోవిyŠ కేసులు నమోదవగా, 7,100 మరణాలు సంభవించాయి. కరోనా భయంతో ఐక్యరాజ్య సమితి కూడా పలు సమావేశాలను రద్దు చేసుకుంది. ఐరాస న్యూయార్క్ కార్యాలయంలోని ఒక ఉద్యోగికి కూడా కోవిడ్ నిర్ధారణ అయింది. పాక్‌లో తొలి మరణం కరోనా కారణంగా పాకిస్తాన్లో మంగళవారం తొలి మరణం నమోదైంది. లాహోర్‌కు 150 కి.మీ.ల దూరంలోని హఫీజాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌తో మరణించారు. పాకిస్తాన్లో మంగళవారం వరకు 193 కేసులు నమోదయ్యాయి. వీటిలో సింధ్ ప్రాంతంలోనే 155 కేసులు నిర్ధారణ అయ్యాయి. వుహాన్‌లో ఒకే కేసు కరోనా వైరస్ తొలి కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరంలో సోమవారం ఒక్క కేసు మాత్రమే కొత్తగా నమోదైంది. అయితే, చైనా వ్యాప్తంగా కరోనా కారణంగా సోమవారం చనిపోయిన 13 మందిలో వుహాన్‌కు చెందిన వారే 12 మంది ఉన్నారు. చైనాలో మొత్తం మృతుల సంఖ్య 3226కి చేరింది. -
అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీకి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘షెవాలీర్ డె లా లెజియన్ డిఆనర్’ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్) పురస్కారంతో సన్మానించనుంది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫ్రాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో భారత్‌లో ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండర్ జిగ్లర్ దీన్ని ఆయనకు అందజేయనున్నట్లు వివరించింది. ఐటీ దిగ్గజంగానే కాకుండా అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, విశ్వవిద్యాలయం ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా ప్రేమ్‌జీ నిమగ్నమైన నేపథ్యంలో ఫ్రాన్స్ పురస్కారం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 28–29 తారీఖుల్లో జరిగే బెంగళూరు టెక్ సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా జిగ్లర్ ఈ పురస్కారాన్ని ప్రేమ్‌జీకి అందజేయనున్నారు. -
అమెరికా దాడిలో వందలాది మంది మృతి!
డమాస్కస్: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో వందలాది మంది మృతి చెందారని సిరియా సైన్యం వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా డెయిర్ ఇజ్-జోర్పై సంకీర్ణ సేనలు బుధవారం జరిపిన ఈ దాడిలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మృతి చెందారని సిరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్మీ జనరల్ కమాండ్ పేరుతో వెల్లడించిన ప్రకటనలో.. అమెరికా సేనల దాడిలో హాల్టా గ్రామం వద్ద భారీగా విష రసాయనాలు విడుదలయ్యాయని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్న వందలాది మంది పౌరులు మృతి చెందారని వెల్లడించింది. విష వాయువుల వల్ల ఊపిరాడకపోవడం మూలంగా వీరంతా మృతి చెందారని సిరియా సైన్యం పేర్కొంది. కాగా.. సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ సిరియన్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల భారీ సంఖ్యలో క్షిపణులతో అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందారు. -
పాకిస్థానే ఎక్కువ నష్టపోయింది!
వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దులు (ఐబీ) మీదుగా పౌరులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్నామని బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ బుధవారం వెల్లడించారు. పాక్ సైన్యం మన పౌరులు లక్ష్యంగా కాల్పులు, షెల్లింగ్ దాడులతో విరుచుకుపడుతుండగా.. తాము కేవలం సైనికులే లక్ష్యంగా నిర్దేశితమైన కచ్చితమైన దాడులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. భారత సైన్యం ఎప్పుడూ కూడా అటువైపున్న సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపలేదని, కాల్పులతో పెట్రేగుతున్న పాక్ రేంజర్లు లక్ష్యంగా కచ్చితమైన ప్రతి దాడి జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. తమ ప్రతిదాడిలో పెద్ద ఎత్తున పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, పాక్ సైన్యం పెద్దసంఖ్యలో నష్టపోయిందని చెప్పారు. ‘మేం వారి పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరిపాం. వారివైపు నష్టం ఎక్కువగా సంభవించింది. అయితే, ఎంతమంది చనిపోయి ఉంటారనే సంఖ్యను మేం ధ్రువీకరించలేం’ అని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులతో మంగళవారం ఎనిమిది మంది భారత పౌరులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మరో 22మంది చనిపోయారు. దీంతో ప్రతిదాడులకు దిగిన భారత సైన్యం దీటుగా దెబ్బకొడుతూ 14 పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. -
అమాయక పౌరుల్ని చంపేందుకే వచ్చా..!
శ్రీనగర్ః భద్రతా బలగాలకు సజీవంగా చిక్కిన పాకిస్తానీ టెర్రరిస్ట్ బహదూర్ అలి.. తాను అమాయక పౌరుల్ని చంపేందుకే పాకిస్తాన్ నుంచీ కశ్మీర్ కు వచ్చినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు తెలిపాడు. కశ్మీర్ లో భద్రతా బలగాలు అరెస్టు తర్వాత.. అతనిని విచారించిన ఎన్ఐఏ ముందు ఈ విచిత్ర ప్రకటన చేశాడు. శ్రీనగర్ లో భద్రతాబలగాలకు చిక్కిన ఉగ్రవాది బహదూర్ అలి ఎన్ఐఏ విచారణ సందర్భంలో అశ్చర్యకర నిజాలను వెల్లడించాడు. బహదూర్ అలి.. అలియాస్ సైఫుల్లా తాను కశ్మీర్ కు సాధారణ, అమాయక ప్రజలను చంపేందుకే పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు ఎన్ఐఏ విచారణలో తెలిపాడు. అంతేకాదు తాను గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో (ఎల్ఈటీ) శిక్షణ పొందినట్లు చెప్పడంతోపాటు, జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను కూడా రెండుసార్లు కలిసినట్లు ఆ 22 ఏళ్ళ టెర్రరిస్ట్ ఎన్ఐఏకు తెలిపాడు. దీనికితోడు తాను పాక్ లో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ తో నిత్యం సంప్రదింపులు కూడా జరిపినట్లు చెప్పాడు. దీంతో బహదూర్ అలి లాహోర్ నగరానికి చెందిన పాకిస్తాన్ జాతీయుడని విచారణలో హోం మంత్రిత్వశాఖ నిర్థారించింది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ అహిర్ కూడా అతడి గుర్తింపును ధ్రువీకరించారు. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టర్ సమీపంలో భద్రతాబలగాల కాల్పుల్లో మరో నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి మాత్రం సజీవంగా పట్టుబడ్డాడు. అతనివద్ద నుంచీ మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల కాలంలో సరిహద్దు జిల్లాల్లో పాకిస్తానీ టెర్రరిస్టును సజీవంగా పట్టుకోవడం ఇది రెండోసారి కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ టీట్వాల్ ప్రాంతంనుంచీ తీవ్రవాదులు లోయలోకి ప్రవేశించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా టాంగ్ధర్ సెక్టర్ లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు.. అక్కడినుంచీ లీపా లోయలోకి వెళ్ళి అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన అడవీప్రాంతంలో దాక్కున్నట్లు హోంశాఖ వెల్లడించింది. -
సామాన్యులపై ప్రభుత్వం కక్ష సాధింపు
-
వైమానిక దాడుల్లో 25 మంది పౌరులు మృతి
రఖా: సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వివిధ దేశాలు జరుపుతున్న వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు సమిధలౌతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వాస్తవ రాజధాని నగరంగా భావించే రఖాలో మంగళవారం జరిగిన వైమానిక దాడుల్లో 25 మంది పౌరులు మృతి చెందనట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నారులు సైతం ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడిన వారు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైమానిక దాడులు జరిపినది ఎవరనేది మాత్రం తెలియరాలేదు. -
రష్యా దాడుల్లో 200 మంది పౌరులు మృతి!
సిరియాలో వైమానిక దాడులు జరుపుతున్న రష్యా.. సామాన్య పౌరుల మృతికి కారణమౌతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో తెలిపింది. ఇప్పటి వరకు 200 మంది సిరియా పౌరులు రష్యా దాడుల్లో మరణించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. సిరియాలోని హమా, లటాకియా, ఇడ్లిబ్, అలెప్పో ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడుల్లో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. నవంబర్ 29 న ఇడ్లిబ్ ప్రాంతంలోని పబ్లిక్ మార్కెట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లోనే 49 మంది పౌరులు మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. అల్ బషర్ ఆహ్వనం మేరకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ సెప్టెంబర్ 30న రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదులకు బదులుగా బషర్ వ్యతిరేక వర్గాలపై రష్యా దాడులు జరుపుతోందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక అవాస్తవం అని, యుద్ద సమాచారాన్ని తప్పుగా అందిస్తూ కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రష్యా ఆరోపించింది. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైకో ఎందుకయ్యాడు?