జమ్మూకశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) క్యాంప్‌పై గ్రనేడ్‌తో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఎల్‌ఈటీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండిస్తూ ట్విట్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.
చదవండి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
థర్డ్‌వేవ్ ముప్పు నిజమే.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment