
ఔగడొగొ: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోకు ఉత్తరాన ఉన్న డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రార్ధనలు జరుగుతుండగా సాయుధులైన కొందరు చర్చిలోకి చొరబడ్డారని డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. చర్చిలో ఉన్నవారు పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు కాల్పులు జరిపారని చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని జోంగో వివరించారు. స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని దోపిడీ చేశారని, చీఫ్ నర్స్ వాహనాన్ని తగులబెట్టారని చెప్పారు. దేశంలో క్రైస్తవ, ముస్లిం మత గురువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment