డ్యామ్లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి | 22 drown as minibus runs off road in Burkina Faso | Sakshi
Sakshi News home page

డ్యామ్లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి

Published Sat, Nov 28 2015 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

డ్యామ్లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి

డ్యామ్లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి

- బుర్కినా ఫాస్కోలో ఘోరం

వాగాడూగు:
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాస్కోలో ఘోర ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన డ్యామ్ లోకి పడిపోవడంతో 22 మంది జలసమాధి అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

27వ నంబర్ జాతీయ రహదారిపై కెబలోగ్ ప్రాంతం వద్ద గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలను అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీస్తున్నదని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత పేద దేశాల్లో ఒకటైన బుర్కినా ఫాస్కోలో సరైన రోడ్లు లేక తరచూ భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం విషాదం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement