minibus
-
హార్సిలీహిల్స్ ఘాట్‌పై తప్పిన ప్రమాదం
బి.కొత్తకోట: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఓ మినీబస్సు బ్రేక్ ఫెయిల్ కాగా డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల 25 మంది పర్యాటకులకు ప్రాణాపాయం తప్పింది. రాయచోటి నియోజకవర్గం చిన్నమండేనికి చెందిన పర్యాటకులు స్థానికంగా ఉన్న ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సును అద్దెకు తీసుకుని హార్సిలీహిల్స్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా ప్రొద్దుటూరు మలుపు వద్దకు రాగానే మినీబస్సు వేగం నియంత్రించేందుకు డ్రైవర్ ఖాదర్‌వలీ ప్రయత్నించగా బ్రేక్ ఫెయిలైంది. వాహనాన్ని అలాగే ముందుకు పోనిస్తే మలుపు వద్ద ప్రమాదం జరిగేది. కానీ అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నేరుగా గ్రిల్ పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొట్టించి బస్సు ఆగేలా చేశారు. ఈ సంఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అందరూ ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలానికి వెళ్లారు. చాలా తక్కువ వేగంతో వస్తున్నందునే ప్రమాదాన్ని నివారించగలిగానని డ్రైవర్ ఖాదర్‌వలీ చెప్పారు. -
కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙
సాక్షి, హైదరాబాద్: కరక్కాయ పొడి విక్రయం పేరిట సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించి, కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ (ఓపీసీ)కు చెందిన మినీ బస్సు వేలానికి సైబరాబాద్ కాంపిటెంట్ అథారిటీ (సీసీఏ) మరోసారి సిద్ధమైంది. ఈసారి 40 సీట్ల సామర్థ్యం ఉన్న అశోక్ లేల్యాండ్ బస్సు (ఏపీ16 టీసీ 4691) రిజర్వ్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తొలిసారి బస్సు వేలం నిర్వహించినప్పుడు రిజర్వ్ ధర రూ.5 లక్షలుగా, రెండోసారి ఏప్రిల్ 20న ధర రూ.4.50 లక్షలుగా నిర్ధారించారు. అయితే రెండు సందర్భాల్లోనూ బిడ్డింగ్‌లో ఎవరూ పాల్గొనకపోవటం గమనార్హం. దీంతో మూడోసారి బస్సు వేలం నిర్వహించేందుకు సీసీఏ ప్రతినిధులు సిద్ధమయ్యారు. వచ్చే నెల 17, మధ్యాహ్నం 1 గంటలోగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), డాక్యుమెంట్లను సమర్పించాలి. 18న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్లైన్లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన నగదును దామాషా ప్రాతిపదికన బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. ఓపీసీ కంపెనీ కరక్కాయ పొడి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మించి 425 మంది నుంచి రూ.3 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. ఈ కేసులో నిందితులు మాటూరి దేవ్‌రాజ్ అనిల్ కుమార్ అలియాస్ రాజన్, ముప్పాల మల్లికార్జున, వడ్డె వెంకయ్య నాయుడు అలియాస్ వెంకయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.59.5 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకు న్నారు. గోల్డ్, బైక్ వేలం పూర్త యిన విషయం తెలిసిందే. (చదవండి: నూకల పరిహారం ఎంతిద్దాం? ) -
శ్రీ మఠానికి మినీ బస్సు విరాళం
మంత్రాలయం రూరల్: రాఘవేంద్రస్వామి మఠానికి రూ.30 లక్షలు విలువ చేసే మినీ బస్సును విరాళంగా అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. చెన్నైకి చెందిన రమేష్ అనే భక్తుడు బస్సును విరాళంగా అందజేశాడని, శ్రీ మఠం అవసరాలకు వినియోగిస్తామన్నారు. దాత కుటుంబసభ్యులకు శేషవస్త్రం, స్వామివారి మెమొంటో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వాదించారు. -
డ్యామ్‌లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి
- బుర్కినా ఫాస్కోలో ఘోరం వాగాడూగు: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాస్కోలో ఘోర ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన డ్యామ్ లోకి పడిపోవడంతో 22 మంది జలసమాధి అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 27వ నంబర్ జాతీయ రహదారిపై కెబలోగ్ ప్రాంతం వద్ద గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలను అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీస్తున్నదని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత పేద దేశాల్లో ఒకటైన బుర్కినా ఫాస్కోలో సరైన రోడ్లు లేక తరచూ భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం విషాదం.