కుమారుడి మృతదేహం వద్ద విలపించిన తల్లి
అశ్రునయనాలమధ్య దినేశ్వర్ అంత్యక్రియలు
బన్సీలాల్‌పేట్: కొండపోచమ్మ డ్యామ్‌లో మునిగిపోయి మృతిచెందిన దినేశ్వర్ అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్‌పేట్ శ్మశానవాటికలో నిర్వహించారు. దీంతో చాచానెహ్రునగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి.స్థానికులు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తరలి వచ్చి దినేశ్వర్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు.
కుమారుడి పారి్థవదేహంపై పడి తల్లి సుమలత విలపించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటావనుకుంటే కొడుకా.. అంతలోనే అందని లోకాలకు వెళ్లావంటూ తల్లి విలపించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. దినేశ్వర్ అంతిమయాత్ర చాచానెహ్రునగర్ నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాల గుండా బన్సీలాల్‌పేట్ శ్మశానవాటికకు చేరుకుంది.
ప్రముఖుల పరామర్శ..
బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లో ఉంచిన దినేశ్వర్ భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. స్ధానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కె. హేమలత, బీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీపతి, జి. పవన్‌కుమార్ గౌడ్, ఏసూరి మహేష్, వెంకటేశన్ రాజు తదితరులు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment