కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ నిర్మించేందుకు చైనా ఆ దేశంతో చర్చలు జరుపుతోంది. పర్వతాలతో కూడిన మారుమూల ప్రాంతమైన వాఖన్ కారిడార్‌లో ఇది ఏర్పాటు కానుం దని అఫ్గానిస్తాన్ అధికారులు చెప్పారు. చైనా, అఫ్గాన్ బలగాలు ఇక్కడ సంయుక్తంగా గస్తీ కాసినట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. వాఖన్ కారిడార్ నుంచి దాని పొరుగునే ఉన్న తమ సరిహద్దు ప్రాంతం జిన్‌జియాంగ్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన చెందుతున్న చైనా..అక్కడ మిలటరీ బేస్ నిర్మించాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని ఆ దేశం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆర్థికంగా, భౌగోళికంగా తన పలుకుబడిని విస్తరించుకునేందుకు కూడా ఈ ప్రణాళిక దోహదపడుతుందని భావిస్తున్నారు. దక్షిణాసియాలో మౌలిక వసతుల కల్పనకు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను అఫ్గాన్‌లోని అస్థిర పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వాఖన్‌లో మిలటరీ బేస్ నిర్మాణానికి సంబంధించి డిసెంబర్‌లోనే చర్చలు జరిగినా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
అఫ్గాన్‌లో చైనా మిలటరీ బేస్!
Feb 3 2018 2:35 AM | Updated on Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement