సుష్మ ‘ముసుగు’పై విమర్శలు
న్యూఢిల్లీ: ఇరాన్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు రౌహానీతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తలనిండా కప్పుకున్న ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారత ఇంధన అవసరాల విషయంలో ఇరాన్‌ను సంతృప్తిపరిచేందుకే మంత్రి ఆ దేశ వేషాధారణలో కనిపించారని నెటిజన్లు అంటున్నారు.
అయితే ఇరాన్ సాంప్రదాయం, చట్టాల ప్రకారం అక్కడ పర్యటించే వారెవరైనా తలను పూర్తిగా కప్పుకోవాల్సిందే. 2014లో స్కార్ఫ్ ధరించేందుకు యురోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రిబొనీనో నిరాకరించటంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది.