‘స్థానిక’ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చ
సెప్టెంబర్ ఆఖరులోగా ఓటర్ల జాబితా పూర్తికి చర్యలు
అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదట్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వేగం పెంచింది. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసి ఏడునెలలు దాటుతున్న నేప థ్యంలో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనివారం అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ని కల నిర్వహణ తీరు, ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు.. తదితరాలపై పార్టీల నేతలకు స్పష్టతనివ్వనున్నారు. ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ స్టేషన్లు, ఇతర ఏర్పాట్లను సెప్టెంబర్ ఆఖరులోగా పూర్తిచేయాలని చూస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రచురణ ముగిశాక రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే అదేరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎస్ ఈసీ సన్నా హాలు చేస్తోంది.
స్థానిక ఎన్నికల్లోనూ అన్నీ కలుపుకుని 50% రిజర్వేషన్లు మించరాదని సుప్రీంకోర్టు ఆదే శాలున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థి తుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వపరంగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తే అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదట్లో గ్రామపంచాయతీ, కొన్నిరోజుల వ్యవధి తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 8న ఎస్‌ఈసీ పార్థ సారధి మూడేళ్ల పదవీకాలం ముగియ నుంది. అయితే ఇప్పటికే ఆయన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినందున, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment