- రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి
ములుగు: హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మార్కెట్, సబ్ మార్కెట్ యార్డుల్లో 10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి అన్నారు. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ యార్డులో శనివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వంటిమామిడిలో రూ.8.5 కోట్లతో కోల్డ్‌స్టోరేజ్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 330 గోదాముల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని, వీటి నిర్మాణాలకు రూ. వెయ్యి 24 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉధ్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ శాఖ జేడీ రవికుమార్, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, డైరెక్టర్లు కరుణాకర్‌రెడ్డి, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.