
'చిల్లర వ్యవహారాలు మానుకోండి'
విశాఖపట్నం: జయలలితకు పడిన శిక్ష వైఎస్ జగన్ కు పడుతుందనడం అవగాహనారాహిత్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. రాజ్యాంగపరమైన పదవులు జగన్ అనుభవించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. చిల్లర వ్యవహారాలు పక్కనపెట్టి ప్రజలకు సరైన పాలన అందించాలని సూచించారు.
ఐఎంజీ తదితర కేసుల్లో ప్రాథమిక ఆధారాలతో విజయమ్మ కోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు భయపడి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. సీబీఐ లేదా అలాంటి సంస్థలతో దర్యాప్తు చేయించుకుని క్లీన్చిట్ ఎందుకు తెచ్చుకోలేదని పార్థసారథి ప్రశ్నించారు.