‘స్కిల్’ కేసులో దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై ఇది సందేహాలను రేకెత్తిస్తోంది
లోక్‌సభలో చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన
కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్‌చిట్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నంచారు. ‘హై ప్రొఫైల్ కేసుల్లో చంద్రబాబు, అజిత్ పవార్‌లకు కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాను.
పవార్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల ఐటీ బినామీ ఆస్తుల కేసు, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబులకు క్లీన్‌చిట్ అంశం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోదీ ప్రభుత్వం పవార్ పేరును క్లియర్ చేస్తే, ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచి్చంది. ఈ కేసుల్లో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేశాయా? తగిన ప్రక్రియను అనుసరించాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. సభ మంగళవారానికి వాయిదా పడటంతో దీనిపై చర్చ జరుగలేదు. ఇదే అంశంపై ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్... ‘ఈడీ, సీబీఐల పారదర్శక విచారణ, పనితీరుపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment