టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన చంద్రబాబు
పార్టీలో సీనియర్లకు దక్కని గౌరవం
గల్లా జయదేవ్, కంభంపాటి, యనమలకు షాక్
డీల్ ప్రకారం బీదకు.. డబ్బు బలం ఉండడంతో సానాకు ఛాన్స్
ఎంపిక తీరుపై టీడీపీలో అసంతృప్తి
మూడో స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
జనసేన తరఫున నాగబాబుకు రాష్ట్ర మంత్రి పదవి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వ్యాపారవేత్తలు సానా సతీష్, బీద మస్తానరావు పేర్లను చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం ఖరారు చేశారు. ఎన్డీయే కూటమి తరఫున మూడో స్థానాన్ని బీజేపీ కూడా తన అభ్యరి్థగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన ఈ ముగ్గురూ మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వాస్తవానికి.. ఈ మూడు స్థానాలు అంతకుముందు వైఎస్సార్‌సీపీకి చెందినవే.
కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్యలను ప్రలోభాలతో రాజీనామా చేయించారు. ఆరి్థకంగా స్థితిమంతుడైన బీద మస్తానరావు రాజీనామా సమయంలోనే తిరిగి ఆ స్థానాన్ని తనకే కేటాయించేలా టీడీపీతో డీల్ కుదుర్చుకుని ఆ పార్టీలో చేరారు. కృష్ణయ్య సైతం మళ్లీ తనకే సీటు ఇచ్చే ఒప్పందంతో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తిరిగి సీట్లు ఇవ్వాలనే ఒప్పందం, భారీ ఆరి్థక లావాదేవీల నేపథ్యంలోనే వీరిద్దరికీ సోమవారం సీట్లను ఖరారుచేశారు.
ఇక మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీలో ప్రస్తుతం బలమైన లాబీయిస్టుగా ఉన్న సానా సతీష్కు కేటాయించారు. ఈయన గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. ఆయన చాలాకాలం నుంచి టీడీపీ, జనసేన పార్టీల కోసం పనిచేస్తూ భారీగా నిధులు సమకూరుస్తున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చారు.
ఈ స్థానం కోసం మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. సానా సతీష్ లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడిగా మారడం, పార్టీలో ఇప్పుడాయన చెప్పిన మాటే నడుస్తుండడంతో ఆయనకే రాజ్యసభ అవకాశం దక్కింది. పార్టీలో ఎంతోమంది సీనియర్లు, ముఖ్యులు ఉండగా వారందరినీ పక్కనపెట్టి లాబీయిస్టులుగా ఉన్న వీరిద్దరికీ పదవులివ్వడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
నాగబాబుకు మంత్రి పదవి..
నిజానికి.. ఈ మూడు స్థానాల్లో ఒకదాన్ని ఆశించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించి ఆ మేరకు ప్రకటన చేశారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటిని టీడీపీ తీసుకోగా ఒకదాన్ని బీజేపీకి కేటాయించడంతో జనసేనకు అవకాశం లేకుండాపోయింది. అంతకుముందు.. సానా సతీష్కు ఇచి్చన స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలనే చర్చ జరిగింది.
అయితే, సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ సతీష్కే అవకాశమివ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో సతీష్‌కి రాజ్యసభ సీటు, నాగబాబుకి మంత్రి పదవిని ఖరారుచేశారు. మరోవైపు.. ఇప్పటిదాకా బీజేపీలో సభ్యత్వంలేని కృష్ణయ్య సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
టీడీపీలో తీవ్ర అసంతృప్తి..
ఇక ఈ ఎంపికలో చంద్రబాబు అనుసరించిన తీరుపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు, పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కొత్తగా వచి్చన లాబీయిస్టులకు అవకాశం ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు. ధనబలం ఉండి ఎక్కువ ఫండ్ ఇచ్చే వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ జరుగుతోంది. యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, దేవినేని ఉమా వంటి నేతలు కూడా ఈ పదవులను ఆశించినా వారిని పట్టించుకోలేదు. యనమల గతంలోనే తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కోరినా ఆయన ఆసక్తి చూపలేదు.
ఇప్పుడూ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంతోనే ఇటీవల ఆయన చంద్రబాబును ధిక్కరిస్తూ లేఖ రాశారు. కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు.. కేవీ రావుకు మద్దతిస్తూ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా యనమల కేవీ రావును దుయ్యబడుతూ చంద్రబాబుకే లేఖ రాశారు. వేల కోట్లు దోచేసిన కేవీ రావును వెనకేసుకుని రావడమేమిటనే రీతిలో లేఖాస్త్రం సంధించడం టీడీపీలో కలకలం రేపింది. కంభంపాటి కూడా రాజ్యసభ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేసినా పట్టించుకోకపోవడంపై అసహనంతో ఉన్నారు. గత ఎన్నికల్లో తనకు మైలవరం సీటు ఇవ్వలేదని, ఇప్పుడు పదవుల విషయంలోనూ న్యాయం చేయడం లేదని ఉమా రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment