
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహంకార పూరిమైన పాలన చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. వైఎస్సార్‌సీపీ మంగళవారం జిల్లాలోని పర్చూరులో నియోజక వర్గాల బూత్ కన్వినర్లకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన ముఖ్యమంత్రే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకైనా కళ్లు, ముక్కు, చెవులు అన్నీ బూత్ కమిటీలే అని చెప్పారు. కర్రలు విసిరినా, కత్తులు తిప్పినా బూత్ స్థాయిలో కన్వినర్లకే సాధ్యమన్నారు. కొత్త ఓట్లు చేర్చడంలో యాక్టివ్‌గా ఉండాలన్నారు. టీడీపీ దోపిడీ రాజకీయాలు, అసమర్ధ పాలనను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు మోపిదేది వెంకట రమణ, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజక వర్గ ఇంచార్జులు గరటయ్య, రావి రామనాధం బాబు, ఎడం బాలాజీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment