ఎన్నికలు ముగిసేవరకూ ఎల్లో టీవీలు చూడకండి | Do Not Watch Yellow TVs Until The Polls Are Over Said By Sajjala Rama Krishna Reddy | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ముగిసేవరకూ ఎల్లో టీవీలు చూడకండి

Published Mon, Jun 4 2018 6:05 PM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM

Do Not Watch Yellow TVs Until The Polls Are Over Said By Sajjala Rama Krishna Reddy - Sakshi

వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

ప్రకాశం జిల్లా: ఎన్నికలు ముగిసేంత వరకూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం చేస్తాడు కాబట్టి ప్రతికార్యకర్త అప్రమత్తంగా ఉండి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలను తెలియజేయాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 165 అసెంబ్లీ సీట్లు తగ్గకుండా గెలుపొందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రతి కార్యకర్తకు వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement