
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రంలో రౌడీలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. తెనాలిలో బహిష్కరణకు గురైన సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు దిగిన ఫొటోలను ఆయన ఆదివారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
'ఇటీవల హైదరాబాద్‌లో తుపాకుల అమ్మే ముఠా ఒకటి పట్టుబడింది. సుబ్బుకు తుపాకులు అమ్మేందుకు వచ్చామని ఆ ముఠా విచారణలో తెలిపింది. అలాంటి వ్యక్తితో చంద్రబాబు ఫొటోలు ఎలా దిగుతారు' అని పార్థసారథి ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీలు ఉండటానికి వీల్లేదన్న చంద్రబాబు.. అదే రౌడీలతో కలిసి ఫొటోలు దిగడమేంటి? అని నిలదీశారు. అసాంఘిక శక్తులను, గన్ కల్చర్‌ను టీడీపే ప్రోత్సహిస్తోందని ఆయన దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment