సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను (2019-20) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలే ప్రాధాన్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఇక ఏపీ బడ్జెట్‌లో రైతులకు సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకంతో 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆర్థికమంత్రి తెలిపారు. పంటల మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు.
వ్యవసాయానికి కేటాయింపులు ఇలా..
- ధరల స్థిరీకరణ నిధి : రూ.3000 కోట్లు
- ప్రకృతి విపత్తుల నివారణ నిధి : రూ.2002 కోట్లు
- వైఎస్సార్ రైతు భీమా : 1163 కోట్లు
- ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ : రూ.475 కోట్లు
- రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
- రైతులకు ఉచిత బోర్లకు : రూ.200 కోట్లు
- విత్తనాల పంపిణీ : రూ.200 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment