సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వారి సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. అలాగే, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు, వైఎస్సార్ బీమాకు రూ.404 కోట్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 400 కోట్లు, నాయిబ్రాహ్మణులు, రజకులు, ట్రైలర్ల సంక్షేమానికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని కేటాయింపులు..
- చేనేతల సంక్షేమానికి రూ.200 కోట్లు
- బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు
- న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment