
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమైంది. ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రూ.2.31 లక్షల కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. కాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment